చెల్లిని వేధిస్తున్నాడని.. కత్తి చేతపట్టిన బాలుడు.. చివరికి?

praveen
ఇటీవలి కాలంలో ఎంతోమంది ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమిస్తున్నాను అంటూ వెంట పడటం..  బలవంతంగా ప్రేమించాలి అంటూ ఎంతో మంది అమ్మాయిల పై ఒత్తిడి తీసుకు రావడం లాంటివి చేస్తున్నారు.  ఇష్టం లేదని చెప్పినా కూడా వేధింపులకు గురిచేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు అన్న విషయం తెలిసిందే.  ఇక మరికొంతమంది ప్రేమిస్తున్నాను అంటూ వెంట పడి మాయమాటలతో నమ్మించి.. చివరికి అన్ని రకాల అవసరాలు తీసుకుని నడిరోడ్డు మీద వదిలేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ అనే ముసుగు వేసుకుని ఎంతో మంది యువతులు పాలిట  శాపం గా మారిపోతున్నారు యువకులు.

 అంతేకాదు ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణ ఘటనలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది  ఆ బాలిక వయస్సు పదమూడేళ్లు. కానీ ఆ బాలిక పై కన్నేశాడు ఆ యువకుడు. ఈ క్రమంలోనే ప్రేమ పేరుతో ఆ బాలికను లొంగదీసుకోవాలని అనుకున్నాడు. దీంతో తరచూ ఆ బాలికను ప్రేమిస్తున్నాను అంటూ వేధించడం మొదలుపెట్టాడు. ప్రేమించకపోతే చచ్చిపోతా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఓ రోజు ఈ విషయం ఆ బాలిక అన్నకు తెలిసింది  చెల్లెలిపై వేధింపులకు గురిచేస్తున్న వాడి పట్ల ఆగ్రహంతో ఊగిపోయాడు అన్న..  కత్తి చేత పట్టుకొని హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

 ఈ ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధిత బాలిక స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. అయితే ఇంటి పక్కనే ఉండే హాఫిస్ అనే 21 ఏళ్ల యువకుడు ఆ బాలికను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేదింపులు గురి చేస్తూ వస్తున్నాడు   అయితే గత నెలలో  ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి బాలికను ప్రేమించాలంటూ బెదిరించాడు  అంతేకాదు మొబైల్ కి  తరచూ సందేశాలు పంపిస్తూ ఉన్నాడు. ఇక ఈ విషయాన్ని గ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు అతని  మందలించారు  కానీ అతని తీరులి మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలోనే అతని తీరుపై బాలిక అన్న ఆగ్రహంతో ఊగిపోయాడు  ఇంట్లో కూరగాయలు కోసే కత్తి తో కడుపులో రెండు మూడు సార్లు పొడిచాడు. అంతలో స్థానికులు అతన్ని నివారించి పోలీసులకు సమాచారం అందించారు  ప్రస్తుతం హాఫిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: