ఆ నీచుడు దొరికాడు.. శభాష్ పోలీస్?

praveen
ఇటీవలే సైదాబాద్ సింగరేణి కాలనీ లో బాలికపై దారుణమైన అత్యాచారం హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజు అనే వ్యక్తి బాలికపై దారుణంగా అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేశాడు. అయితే ఈ ఘటన కాస్త సంచలనంగా మారగా.. పోలీసులు సవాల్గా తీసుకున్నారు. బాలికను హత్య చేసిన నిందితులు పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. దీంతో ఇక నిందితుల్ని పట్టుకోవడానికి పలు బృందాలుగా విడిపోయారు పోలీసులు. ఈ క్రమంలోనే ఇటీవల నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 యాదాద్రి జిల్లా నిందితుడి స్వగ్రామం అయిన అడ్డగూడూరు లోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి బాలిక అదృశ్యం నుంచి పోలీసులకు సవాలుగా మారింది. సింగరేణి కాలనీ లో బాలిక అదృశ్యం ఫై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇటీవల రాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక మృత దేహం లభ్యం కావడం సంచలనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక రాజు బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 ఏకంగా ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం పది బృందాలుగా విడిపోయి గాలించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఎంతో చాకచక్యంగా ఇటీవలే నిందితుడు రాజును ఏకంగా స్వగ్రామంలోనే అరెస్టు చేసి అటు హైదరాబాద్ తరలించారు పోలీసులు. అయితే మాకు న్యాయం చేయాలి అంటూ నిన్న బాధిత కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఇక ఏడు గంటలపాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కలెక్టర్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అంతేకాదు బాధిత కుటుంబంలో ఒకరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తో పాటు పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం కూడా కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 50 వేల రూపాయలు కూడా అందజేశారు. బాధిత కుటుంబం లోని మిగతా ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: