లాకర్ నుండి 2 కోట్ల బంగారం మాయం.. ఎలా పోయిందంటే?

praveen
సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ దగ్గర చాలా డబ్బు ఉంది అంటే వెంటనే బ్యాంకులో దాచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎప్పుడైనా దొంగలు పడి పూర్తిగా దోచుకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా భారీగా డబ్బు బంగారం సహా విలువైన వస్తువులను కూడా బ్యాంకు లాకర్ లోనే భద్రంగా దాచి పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక బ్యాంకులో అయితే సీసీ కెమెరాల నిఘా ఉంటుంది ఎప్పుడూ ఒక సెక్యూరిటీ గార్డ్ గన్ పట్టుకొని బ్యాంకుకు కాపలా కాస్తూ ఉంటారు.



 అంతేకాదు బ్యాంకు సిబ్బంది ఎంతో పటిష్టంగా లాకర్లలో కస్టమర్ల వస్తువులను డబ్బులు కూడా అటు భద్రపరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందుకే ప్రతి ఒక్కరూ ఇలా తమ డబ్బు బంగారం బ్యాంకు లాకర్లలో పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ  బ్యాంకు లాకర్ లో కూడా రక్షణ లేకుండా పోయింది. బ్యాంకు లాకర్ లో పెట్టిన రెండు కోట్ల రూపాయలు బంగారం మాయం అయింది. దీంతో ఇక ఆ బంగారాన్ని లాకర్ లో పెట్టిన కస్టమర్ అవాక్కావాల్సిన  పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘటన ఏపీ లోని గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.


 ఇక ఆ తర్వాత పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరపగా.. ఆ రెండు కోట్ల రూపాయల బంగారం మాయం చేసింది ఎవరో కాదు ఇంటి దొంగ అన్న విషయం తెలిసింది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా గుర్తుపట్టలేదు అని చెబుతూ ఉంటారు. నిజంగానే పోలీసులకు దొంగను గుర్తించడం చాలా కష్టం గా మారిపోయింది. గుంటూరు జిల్లా బాపట్ల లోని బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఇటీవలే దొంగతనం జరిగింది. అటెండర్గా పనిచేస్తున్న ప్రవీణ్ రాజు లాకర్ లో ఉన్న రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లి పోయాడు. ఖాతాదారులు తనఖా పెట్టి రుణాలు తీసుకున్న బంగారం చోరీ చేశాడని పోలీసులు విచారణలో తేలింది. అయితే బాధితులు ఆందోళన చేపట్టారు. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు నిందితున్ని పట్టుకొని మొత్తాన్ని రికవరీ చేస్తారని బ్యాంకు అధికారులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: