ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితి చాలా దారుణంగా మారాయి. ఆ దేశాన్ని మొత్తం తాలిబన్లు వారి చేతుల్లోకి పూర్తిగా తీసుకున్నారు. వారి యొక్క చట్టాలను కూడా అక్కడ అమలు చేశారు. ఎదురు తిరిగిన వారిని చంపడం లేదా బెదిరించడమే వారి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆడవాళ్ళ పరిస్థితి చెప్పనక్కర్లేదు. కనీసం వారిని మనిషిలా కూడా చూడడం లేదు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ లో స్త్రీల పరిస్థితి రోజుకో తీరుగా మారుతుంది అని చెప్పవచ్చు. తాలిబన్ కిరాతకుల నుండి తప్పించుకోవడానికి వారి వారి కుటుంబ సభ్యులు వారి ఇండ్లలో ఉన్నటువంటి యువతులకు పెళ్లిళ్లు చేసి బోర్డర్ దాటించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తరలింపు కేంద్రంలో వెలుగు చూసినటువంటి ఈ మానవుల అక్రమ రవాణా ఘటనపై అమెరికా యొక్క దౌత్యాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాబుల్ ప్రాంతాన్ని తాలిబన్లు వారి వశం చేసుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారి పోవడం కోసం కొంత మంది కుటుంబ సభ్యులు డబ్బులు ఇచ్చి మరి పెళ్ళికొడుకులను వెతుకుతున్నారు. దీంతో వారికి వివాహాలు చేసి దేశం తరలించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ఘటనలు తాళిబాన్ ల అరాచక పాలన నుంచి తప్పించుకోవడం కోసమే అక్కడి స్త్రీలు ఇలా పెళ్లిళ్లు చేసుకున్నారు అంటే అక్కడ వారి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అయితే అమెరికా దౌత్య అధికారులు ఇలాంటి మానవ అక్రమ రవాణా ఘటనలను గుర్తించి వారికి సహాయం అందించడం కోసం ముమ్మరంగా చర్యలు చేపట్టారు. కానీ అమెరికాకు చెందిన దళాలు ఆగస్టు 30వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించిన విషయం మనకు తెలిసిందే.
దీంతో 20 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి తెరపడింది. అయితే తాలిబన్ల పాలన ప్రారంభం అయ్యాక కనీసం మహిళలు హక్కు లేని గతంలో తాలిబన్ పాలన ఎలా ఉందో గుర్తు చేసుకునేలా ఉందని అంటున్నారు. అలాగే మన కుటుంబ సభ్యులు లేనటువంటి మహిళల యొక్క ప్రయాణాలను తాలిబన్లు అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితులలో కొన్ని ప్రైవేటు గ్రూపుల తనను వెంటాడుతున్నాయి అని తెలిస్తే దేశ సరిహద్దులు దాటోద్దని సూచించారు. అందుకే కుటుంబ సభ్యులు వారి పిల్లలకు చాలా బలవంతంగా పెళ్లిళ్లు చేసి మళ్లీ పంపిస్తూ ఉన్నారు.