ఘటనా స్థలంలో కండోమ్‌ దొరికితే.. ఇష్టపూర్వక శృంగారంగా పరిగణించలేం !

Veldandi Saikiran
ఓ రేప్‌ కేసులో  కీలక వ్యాఖ్యలు చేసింది ముంబై కోర్టు. రేప్‌ జరిగిన స్థలంలో కండోమ్‌ దొరికితే.. ఏకాభిప్రాయంతో జరిగిన సెక్స్‌ గా పరిగణించలేమని స్పష్పం చేసింది.  కానీ... ఆ రేప్‌ కేసులో నిందుతుడైన నావి ఆఫీసర్‌ కు బెయిల్‌ ఇచ్చింది ముంబై కోర్టు.  ఈ ఘటన వివరాల్లోకి వెళితే..  ఓ మహిళ తన భర్తతో కలిసి...  నావల్‌ క్వార్టర్స్‌ లో నివసిస్తున్నారు.  అయితే.. నిందితుడితో సహా మరో ఇద్దరు నావి అధికారులు... కూడా అదే క్వార్టర్స్‌ లో ఉంటున్నారు.  అయితే.. ఆమె భర్తతో శిక్షణ నిమిత్తం... కేరళ వెళ్లాడు. ఈ నేపథ్యం లో ఆ నావి ఆఫీసర్‌ చాక్లెట్‌ మత్తు మందు ఇచ్చి.. ఆమె ఆత్యాచారం చేయబోయాడు.


ఈ విషయాన్ని ఫిర్యాదులో కూడా పేర్కొంది బాధితురాలు. అంతేకాదు.. తన భర్తను కేసులో ఇరికిస్తానని... బెదిరించి తన పై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది.  ఈ నేపథ్యం లోనే తాను కత్తితో అతన్ని బెదిరించానని.. ఆ తర్వాత తన భర్తతో కలిసి.. పోలీసులు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. అయితే.. కేసు బుక్‌ కాగానే.. ఆ నిందితుడు బెయిల్‌ కోసం అప్లై చేసుకున్నాడు.   అయితే.. బెయిల్‌ విచారణ నేపథ్యం లో నిందితుడి తరఫు న్యాయవాది...  తన క్లయింట్‌ పై తప్పుడు కేసు పెట్టారని కోర్టు లో వాదించారు.  


ఈ ఘటన సమయంలో ఆమె ఇంట్లో మరో వ్యక్తి ఉన్నాడని.. ఆ వ్యక్తి ఉన్న సమయం లో తన క్లయింట్‌ ఎలా దాడి చేస్తాడని ప్రశ్నించారు న్యాయవాది.  పిల్లలు కావడంలేదని ఆ భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడు గొడవ పడతారని..  ఈ నేపథ్యం లో తన క్లయింట్‌ నే ఆమె రెచ్చగొట్టిందన్నారు. అయితే... ఈ వాదనలు విన్న కోర్టు.. భర్త లేకపోవడంతో నిందితుడు ఛాన్స్‌ గా తీసుకున్నట్లు గుర్తించింది.  లైంగిక దాడి జరిగిన స్థలంలో కండోం దొరికినంత మాత్రాన ఏకాభిప్రాయంతో జరిగినా.. సెక్స్‌ కాదని...  ఫ్యూచర్‌ లో వచ్చే సమస్యల నుంచి ఎస్కేప్‌ అయ్యేందుకు నిందితుడు కండోం వినియోగించే విషయాన్ని తీసిపారేయలేమని తెలిపింది కోర్టు.  ఇక చివరకు ఆ నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: