ఒక్కోసారి దురదృష్టం మన వెన్నంటే ఉంటే మనం అనుకున్నది చేయలేకపోయాం. మనం ఏ పని చేద్దాం అన్నా అందులో మన నష్టమే కలుగుతుంది. పెళ్లి కోసం అంతా సిద్ధం చేశారు. పెళ్లి ముహూర్తం టైమ్ కూడా దగ్గరకు వచ్చింది. పెళ్లి కుమార్తెను పెళ్లి మండపం లోనికి తీసుకు వచ్చే సమయం. ఇంతలోనే అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఏం జరిగింది.. ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది..? దానికి కారణం ఏమిటి..? విశాఖ జిల్లాలోని మద్దిలపాలెం లో పెళ్లి వారి ఇంట విషాద చాయలు అలముకున్నాయి. ఎంతో సంతోషంగా వివాహం జరిపించాల్సిన సమయం.
విశాఖపట్నం జిల్లాలోని మద్దిలపాలెం గ్రామంలో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం జరిగింది .
కొద్దిసేపట్లో కన్న కూతురి పెళ్లి. ఎంతో ఆనందంగా కన్యాదానం చేయవలసిన సమయం అది. వివాహం జరగడానికి ముందే చాలా ఘోరం జరిగిపోయింది. వధువు తల్లిదండ్రులు ఇద్దరూ అకస్మాత్తుగా మరణించారు. వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు పెళ్లి మండపం నుంచి ఎవరికీ చెప్పకుండా వారి ఇంటికి వెళ్లారు. పెళ్లి కుమార్తెను తీసుకు వచ్చే సమయం వధువు తల్లిదండ్రుల కోసం బంధువులు వెతగ్గా వారు అక్కడ కనిపించలేదు. వారిద్దరు కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లారు అనుకొని మీరు వెళ్లి చూడగా షాక్ కు గురయ్యారు. పెళ్లికూతురు తల్లిదండ్రులిద్దరూ విగత జీవులై పడిపోయారు. ఇందులో పెళ్లికుమార్తె తండ్రి విశాఖ పోర్టులో రిటైర్డ్ ఉద్యోగి జగన్నాథరావు 63 సంవత్సరాలు. అతని భార్య విజయలక్ష్మి 57 సంవత్సరాలు.
వధువు తల్లి విజయలక్ష్మి గత కొద్ది రోజులుగా మానసికంగా బాగాలేక బాధపడుతుంది. ఈ కారణంతో విజయలక్ష్మి ఎప్పుడూ ఇరుగుపొరుగు వారితో గొడవలకు దిగేది. అదేవిధంగా పెళ్లి రోజు కూడా తన భర్తతో గొడవ పెట్టుకుందని బంధువులు తెలిపారు. ఆమె ప్రవర్తనతో విసిగి చెందినటువంటి జగన్నాధరావు ఆమెను హత్య చేసి, తను కూడా ఉరి వేసుకుని చనిపోయినట్టు పోలీసులు భావించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం కొడుకు విశాఖ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.