దైవదర్శనానికి వెళ్తే.. గ్యాంగ్ రేప్.. చివరికి?
కానీ ఇప్పుడు మాత్రం కామాంధులు మరింత రెచ్చి పోతున్నారు. ఆడపిల్లల పక్కన కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వెనకడుగు వేయడం లేదు. ఏకంగా కుటుంబ సభ్యులను బంధించి మరీ వారి కళ్ల ముందు అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు అటు ఆడపిల్ల రక్షణ ను మరింత ప్రశ్నార్థకం గా మారుస్తున్నాయ్ అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. స్నేహితుడి తో బయటికి వెళ్ళిన ఆ యువతి పై ఏకంగా అత్యాచారం జరగడం సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది.
మైసూర్ యూనివర్సిటీ లో చదువుతున్న యువతి ఇటీవలే రాత్రి సమయంలో స్నేహితుడితో కలిసి పుణ్యక్షేత్రమైన లలితా త్రిపురాద్రిపుర కు వెళ్ళింది. కానీ ఇలా దైవదర్శనానికి వెళ్లడమే ఆ యువతి పాలిట శాపంగా మారి పోయింది. ఇక రాత్రి సమయంలో ఆ యువతీ యువకులను గమనించిన ఆరుగురు కామాంధులు వారిని వెంబడించారు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉండడంతో విచక్షణ రహితంగా ప్రవర్తించారు. ఇక మార్గమధ్యంలో వారిని అడ్డగించి ఏకంగా స్నేహితుడిని కొట్టి యువతిపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.