ఆమె అవసరం అతనికి అవకాశంగా మారింది.. చివరికి?
ఏదో ఒక విధంగా ఆడపిల్ల కనిపిస్తే చాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం చేసి వచ్చిన జీతంతో తన కాళ్ళపై తాను నిలబడి ఈ సమాజంలో ఎంతో గౌరవంగా బతకాలి అనుకుంది ఆ యువతి. ఈ క్రమంలోనే ఉద్యోగం కోసం వెతుకులాట ప్రారంభించింది. కానీ ఆమె అవసరాన్ని అతడు ఆసరాగా చేసుకున్నాడు చివరికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు ఇటీవలే పోలీసులను ఆశ్రయించింది ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది
అయితే బాధితురాలు ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటన జరిగింది గుంటూరులో కావడంతో అక్కడికి ఈ కేసును బదిలీ చేశారు పోలీసులు. ప్రకాశం జిల్లా దర్శి కి చెందిన మహిళలకూ అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అయితే చదువు పూర్తి చేసిన సదరు మహిళ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది దీంతో ఇక ఆ యువతి అవసరాన్ని ఆసరాగా చేసుకున్నాడు బ్రహ్మయ్య. హైదరాబాద్ లో తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు ఈ క్రమంలోనే ఉద్యోగం గురించి మాట్లాడదాం అంటూ జూలై 11వ తేదీన గుంటూరు తీసుకొచ్చి లాడ్జి కి తీసుకెళ్లి ఆపై అత్యాచారం చేశాడు అంతేకాదు నగ్న వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎప్పుడంటే అప్పుడు తన కోరిక తీర్చాలని లేదంటే ఇక ఈ వీడియోలు బయట పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు రోజురోజుకు అతని వేధింపులు ఎక్కువవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు