దారుణం : గేదె పై అత్యాచారం.. అంతలో ప్రాణం పోయింది?
ఆడపిల్లలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కేవలం ఆడపిల్లలు మాత్రమే కాదు అటు మూగజీవాలు సైతం కామందుల బారినపడి బలవుతున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తూ సభ్య సమాజాన్ని మొత్తం సిగ్గు పడేలా చేస్తున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి ఏకంగా మూగజీవాలను కూడా వదలడంలేదు. ఇప్పటికే ఎంతోమంది ఏకంగా కొన్ని మూగ జీవాలపై అత్యాచారం చేసిన ఘటలు న వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగు చూసింది.
ఈ ఘటన గురించి వింటే మనుషులు ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేయక మానదు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక మృగాడు ఏకంగా ఒక గేదె పై అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం గా మారిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కూలిపని చేసుకునే 45 ఏళ్ల ఆంజనేయులు అనే వ్యక్తి గేదెపై అత్యాచారం చేశాడు. గమనించిన గ్రామస్తులు అతడికి దేహశుద్ధి చేశారు . అయినప్పటికీ అతని బుద్ధి మాత్రం మారలేదు. మరోసారి కట్టేసి ఉన్న ఒక గేదె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇక ఆ గేదె తోక అతని మెడకు చుట్టుకోవడంతో ఇక మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం మారిపోయింది.