ప్రియుడి వివాహం .. ఆ వధువుతో కలిసి పీటలపై మాజీ ప్రియురాలు..ఆపై..?

MOHAN BABU
కొన్ని కొన్ని పెళ్లిళ్లలో  అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. కొన్ని వివాహాల్లో తాళికట్టే సమయానికి ఆపండి అని, వివాహాల్లో  పోలీసులు వచ్చి  ఆపడం ఇలా పలు సంఘటనలతో కొన్ని విచిత్ర పెళ్లిళ్లు జరుగుతాయి. అలాంటి ఓ సంఘటన  ఈ పెళ్లి మండపంలో జరిగింది. అది ఏంటో తెలుసుకుందాం.. ఎప్పుడో 2016వ సంవత్సరంలో  ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమించాడు. దీంతో సదరు అమ్మాయి  ప్రస్తుతం ఆయన మరో పెళ్లి పెళ్లి చేసుకుంటుండగా  ఆ మండపంలో ప్రత్యక్షమైంది. ఆ వ్యక్తి పెళ్లి చేసుకుంటున్న వధువుతో పాటు  తనను కూడా పెళ్లి చేసుకోవాలని కోరింది. దీంతో వ్యక్తి ఏం చేశాడు..?


 వారిద్దరూ ఒకప్పుడు మంచి ప్రేమికులు. వారి మధ్య తలెత్తిన గొడవలు ఇతరత్రా కారణాల వల్ల వారు విడిపోయారు. కానీ ఆమె మనసు మాత్రం ఆ వ్యక్తిని వదిలిపెట్టడం లేదు. ఎప్పటికప్పుడు తన ప్రియుడి గురించి  ఆరాతీస్తూనే ఉంటుంది. చివరికి  వివాహం జరుగుతున్న విషయం తెలుసుకొని  ఆ ప్రియురాలు అక్కడి చేరుకున్నది. నన్ను కూడా పెళ్లి చేసుకోవాలని  ఆ మాజీ ప్రియున్ని  కోరింది. చివరికి ఏం జరిగింది.. ఆ ప్రియుడు ఒప్పుకున్నాడా.. అతని కుటుంబ సభ్యులు అంగీకరించారా..? మేరరికి సంప్రదాయం ప్రకారం  నూర్ కోరిక్ లా వివాహం జరిగాలి. వారి ఆచారం ప్రకారంమే  పెళ్లి కూతురు  నూరున్ వరుడు కోరిక్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ సమయంలోనే  కోరిక్ మాజీ లవర్  అక్కడికి చేరుకుంది. దీంతో ఆమెను చూసి ఆయన షాక్ తిన్నాడు.


 ఆ ప్రియురాలు కోరిక విన్న తర్వాత వధువు కూడా  షాక్ కు గురైంది. నేను అతన్ని విడిచిపెట్టి ఉండలేనని, నాకు అతనితో వివాహం చేయండి అని అడిగింది. దీంతో కాసేపు అక్కడ  వాతావరణమంతా  చేంజ్ అయిపోయింది. వివాహానికి వచ్చిన వారంతా  ఈ సన్నివేశాన్ని చూస్తూ  నిర్ఘాంత  పోయారు. చివరికి  ఆమె కోరికను మన్నించి నటువంటి కోరిక్ అతని బంధుమిత్రులను, ఒప్పించి  ఆ పెళ్ళి వేదికపై  ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు. దీంట్లో వచ్చిన మరో ఇబ్బంది ఏమిటంటే కోరిక్ నిరుద్యోగి అతనికి ఇద్దరు భార్యలని చూసుకోవడం చాలా కష్టంగా మారిందని  అక్కడ ఉన్నటువంటి జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: