అమానుషం: కన్న కూతురును కాటు వేసిన తండ్రి..!

MOHAN BABU
తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి  ఒక కుటుంబం  బతుకుదెరువు కోసం అని హైదరాబాద్ వచ్చి నివాసముంటోంది. వీరంతా  ఒక అపార్ట్మెంట్ లో ఉండగా  భర్త అక్కడ అపార్ట్మెంట్ వాచ్మెన్ గా చేస్తాడు. అతని భార్య  ఇండ్లలో పని చేసుకుంటుంది. వీరికి 2003లో  వివాహం జరిగినది. ఒక కూతురు 16 సంవత్సరాలు, ఒక కొడుకు 14 సంవత్సరాలు ఉన్నారు. కొడుకు తూర్పుగోదావరి జిల్లాలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. కూతురు తొమ్మిదో తరగతి చదువు ఆపేసి ప్రస్తుతం తల్లిదండ్రులతోనే ఉంటుంది. ఈ క్రమంలోనే కూతురు అనారోగ్యానికి గురైంది. వాంతులు , చేసుకుంటుండగా తల్లి నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి, డాక్టర్ చూపించి పరీక్షలు చేయించింది. దీంతో  ఆ కూతురు గర్భవతి అని తెలిసింది. దీంతో ఆ తల్లి  షాక్ గురైంది.. వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత కోపంతో ఇదేంటని ఆ కూతురిని మందలించగా అసలు విషయం చెప్పింది.


తల్లి పనికి వెళ్లిన సమయంలో తండ్రి కూతురు తినే భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి నిద్ర పోయిన తర్వాత కూతురిపై పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పింది. ఇలా ఒక రోజు నిద్ర లేచి చూడగానే  తన ఒంటిపై బట్టలు కూడా ఉండేవి కావని, కూతురు తన ఆవేదనను తల్లితో చెప్పింది. మరియు ఒళ్లంతా నొప్పులు ఉండేవని, కొంతకాలం క్రితం  తల్లి ఒక్కతే కాకినాడకు వెళ్లగా ఒక రోజు తండ్రి బాగా తాగి వచ్చి  కూతురిపై అత్యాచారం చేసి ఈ విషయం ఎవరికైనా చెబితే, అందరిని చంపేస్తానని బెదిరించాడని ఆ అమ్మాయి చెప్పింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి తండ్రి వెంకటరమణ  ఇల్లు వదిలి పారిపోయాడు.


దీంతో ఆ తల్లి అతనిపై  జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో  కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్నటువంటి తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా  కన్న తండ్రి తను కన్న కూతురును ఇలా చేయడం అనేది చాలా అమానుషమైన ఘటన అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: