ఫేస్బుక్ లో బుక్కయింది.. అవి కూడా పంపింది.. చివరికి..?

MOHAN BABU
సామాజిక మాధ్యమం అనేది మనం ఏ విధంగా ఉపయోగిస్తాం అనే దానిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ సామాజిక మాధ్యమం ద్వారా ఎంతోమంది ఇబ్బందుల పాలవుతున్నారు. ఎంతో మంది యువతులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తెలిసి తెలియక ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అలాంటి ఒక సంఘటనే హైదరాబాదులో చోటు చేసుకుంది. అది ఏంటో తెలుసుకుందాం..? హైదరాబాద్ లోని మెహిదీపట్నం చెందినటువంటి ఓ మహిళ  డాక్టర్.. ఆమెకు ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని పూర్తిగా నమ్మింది.. అతనితో బిజినెస్ డీల్ కూడా కుదుర్చుకుంది.. ఆయన చెప్పినట్లుగా చేసినది. ఇది గమనించిన ఆమె కూతురు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం బయట పడి షాక్ అయింది. వివరాల్లోకి వెళితే మహిళా డాక్టర్ కు నైజీరియాకు చెందిన వ్యక్తి మెస్సి డాన్ హోతో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. సదరు వ్యక్తి తాను ఇటలీకి చెందిన వ్యక్తిని అని అంటూ ఆ డాక్టర్ తో పరిచయం పెంచుకున్నాడు.


కొంతకాలంగా ఆమెతో పరిచయం చాలా సన్నిహితంగా సాగింది. ఇటీవల కాలంలో మెస్సి బిజినెస్ డీల్ కూడా మాట్లాడారు. హెర్బల్ ఫార్ములా, మెడిసిన్స్,  పంపిస్తే తమ దేశంలో వ్యాపారం చేసుకుంటానని చెప్పాడు.
 ఇందుకోసం 5 వేల కోట్ల రూపాయల చెల్లించనున్నట్లు గా తెలిపాడు. కొంత కాలంగా పరిచయం ఉండడంతో వైద్యులు అతని మాటలు నమ్మింది. దీంతో మెస్సి గేమ్ స్టార్ట్ చేశాడు.ఆమెకు మరింత నమ్మకం కలిగేలా ఒక అకౌంటుకు చెందినటువంటి డెబిట్ కార్డు కూడా పంపాడు. అందులో నుంచి ఆ వైద్యురాలు నాలుగు వేలు డ్రా చేశాడు.. తర్వాత ఆయన ఢిల్లీ కస్టమ్స్ అధికారుల పేరుతో వైద్యురాలికి ఫోన్ చేశాడు. మీకు వచ్చిన ఐదు కోట్ల రూపాయలు తీసుకోవాలని చెప్పాడు. దీనికోసం డబ్బులు చెల్లించాలని ఆమెకు నమ్మబలికాడు. ఈ మాటలు నమ్మిన డాక్టర్ పలు దఫాలుగా 20 లక్షల రూపాయలు వాళ్లు చెప్పిన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత మెస్సి తన కుమార్తె చనిపోయిందని నాటకమాడి మరో ఇరవై ఒక్క లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. డాక్టర్ ఇంకా డబ్బులు పంపుతూనే ఉన్నారు. దీంతో వైద్యురాలి కూతురికి అనుమానం రావడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.


అతనిది ఇటలీ కాదని నైజీరియన్ అని తేల్చి చెప్పారు. అతడు చెప్పిందంతా డ్రామా అని, ఇప్పటికే పలువురిని మోసం చేశారని  పోలీసులు గుర్తించారు. వెంటనే అతను ఢిల్లీలో గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తి వద్ద ఉన్న ల్యాప్టాప్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్న. విజిటింగ్ వీసా మీద వచ్చిన మెస్సి.. వీసా గడువు ముగిసినప్పటికీ ఇండియా లోనే ఉంటున్న నేరాలకు పాల్పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: