కరోణ దీని పేరు వింటేనే అరికాళ్ళలో వణుకు పుడుతుంది. ఇది ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. దీని దాటికి ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. ఇది ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లు ఇప్పటికే వచ్చాయి. ఇంకా రాబోవు రోజుల్లో థర్డ్ లేవు కూడా రాబోతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ కరోనా వైరస్ కు ఆస్తులు ఉన్న వారు, లేనివారు అనే తేడా లేకుండా ఎవరినైనా అటాక్ చేయవచ్చు. దీంతో ఎవరి ప్రాణమైన పోవచ్చు.
అలా కరోణతో చనిపోతున్నా ఈ శవాలను వీరు లాభార్జన కోసం ఉపయోగిస్తున్నారు. చివరికి డెడ్ బాడీ మీద ఉండే బంగారు ఆభరణాలను దొంగిలి స్తూ దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే కరోణ పేషెంట్లు చనిపోతే వారి డెడ్ బాడీ మీద ఉండే బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న దంపతులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి పది లక్షల రూపాయల విలువగల సొమ్మును రికవరీ చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రఘునందన్ రావు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా ధర్మ పురానికి చెందినటువంటి చింతల రాజు 36 సంవత్సరాలు, మొదటి భార్యతో విడిపోయిన అతను నగరానికి వచ్చి ఉంటున్నాడు. 2017 లో మళ్లీ లత శ్రీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఎల్లంబండాలో నివాసం ఉంటున్నాడు.
లత శ్రీ గచ్చిబౌలిలోని కిమ్స్ లో పేషెంట్ కేర్ లో పనిచేస్తున్నది . రాజు కూడా అక్కడే విధుల్లో చేరారు. ఇక్కడే వారి బుద్ధి గడ్డి తిన్నది. అక్రమ మార్గంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. కరోనా వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిన రోగుల దగ్గర, మరియు చనిపోయినటువంటి మృతదేహాల పైన బంగారు వెండి ఆభరణాలను దొంగిలించడం మొదలుపెట్టారు. అలా దొంగిలించిన సొత్తును బంగారం షాపులో తాకట్టు పెట్టే వారు. ఈ సందర్భంలో టిమ్స్ లో తమ బంధువుల వంటిపై మరియు మృతదేహాల పైన బంగారు నగలు మాయం అయ్యాయి అని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు ఏడు కేసులు నమోద య్యాయి. ఈ సందర్భంగా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ దర్యాప్తులోనే వీరి బండారం అంతా బయటకు వచ్చింది. వెంటనే రాజు లతా స్త్రీ లను అదుపులోకి తీసుకొని వారీదగ్గర నుంచి 80 తులాల వెండి, 16 తులాల బంగారు ఆభరణాలను, ఒక మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.