
దారుణం.. కన్న కొడుకును చంపిన కసాయి తల్లి..
వివరాల్లొకి వెళితే.. అనంతపురం కదిరి నియోజకవర్గంలో దారుణ ఘటన జరిగింది. సొంత కొడుకుని హత్య చేసేందుకు సుఫారీ ఇచ్చింది ఒక తల్లి. తన ప్రియుడి తో శృంగారాని కి అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి యువకుడిని అతి దారుణంగా చంపించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.అనంతపురం జిల్లా నల్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధి లో పోలేవాండ్ల పల్లి సమీపం లోని ఆవుల చెరువు వద్ద వారం కిందట గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరిపారు. తల్లి పై అనుమానం రావడంతో వారి స్తైల్లొ విచారణ జరిపారు.తల్లి సుబ్బలక్ష్మి అక్రమ సంబంధం పలువురితో ఏర్పరచుకుంది. ఈ నేపథ్యం లోనే తల్లి కొడుకుల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో తన అకౌంట్ లు బయట పడకుండా ఉండాలంటే కొడుకు ఉండకూడదని భావించి అడ్డు తొలగించాలని పథకం వేసింది. ఓ వ్యక్తి కి సుఫారి ఇచ్చి చంపించింది. కోడలు ఈ విషయం పై పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది.. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ప్రస్తుతం వీరిని రిమాండ్ కు పంపించారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది..