ఆన్లైన్ పరిచయం.. ప్రేమ.. చివరికి?
ఇక ఇటీవలే ఆన్ లైన్ లో ప్రేమ పేరుతో మోసానికి బాలిక బలైంది. ఆన్లైన్లో ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ లో ఇంటర్ విద్యార్థి ఉంది. ఇటీవలే బాలికకు మెహదీపట్నం కి చెందిన సమద్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇక కొన్ని రోజుల్లోనే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే సమద్ పైపైకి ప్రేమను నటిస్తున్నప్పటికీ.. ఇక క్రమంగా బాలికను లైంగికంగా లోబర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
కానీ సదరు బాలిక మాత్రం లైంగికంగా ఎక్కడ సపోర్ట్ చేయలేదు. సమద్ ఏమడిగినా నిరాకరిస్తూ వచ్చింది. ఇలా అయితే పని జరగదు అనుకున్నాడో ఏమో.. తనతో పాటు దిగిన ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో పెడతాను అంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ ఆ బాలిక మాత్రం ఒప్పుకోలేదు. దీంతో రోజు రోజుకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఇక మనస్తాపం చెందిన బాలిక గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక సముద్ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసింది బాలిక. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.