రంగురాళ్ల కేసులో కొత్త ట్విస్ట్.. అసలు సంగతేంటంటే?

praveen
జ్యోతిష్యుడు మురళి శర్మ ఇటీవల తన ఇంట్లో 30 లక్షల విలువచేసే రంగురాళ్లు ఇక రెండు సూట్ కేసు లలో డబ్బులు కూడా పోయాయి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇక ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు పలు బృందాలుగా ఏర్పడి గాలించారు. ఈక్రమంలోనే కారు నెంబరు ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు పోలీసులు. అయితే ఇక నలుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని విచారించారు. ఇక ఈ విచారణలో కొత్త ట్విస్ట్ లు వెలుగులోకి వచ్చాయి


 ఇక పోలీసు విచారణలో నలుగురు నిందితులు కీలక విషయాలను వెల్లడించారు. తాము నగదు చోరీ చేసిన మాట వాస్తవమేనని.. అయితే ఆ చోరీ చేసిన డబ్బులు నకిలీ నోట్లు గా గుర్తించి ఇక వాటిని తగలబెట్టామని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు.  దీంతో నకిలీ నోట్లు ఎలా వచ్చాయి అనే దానిపై పోలీసులు తీగ లాగితే డొంక కదిలినట్లు అయింది పరిస్థితి. ఇక ఈ విషయంపై అటు జ్యోతిష్యుడు మురళీశర్మ ను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.



 రంగు రాళ్లతో ప్రజలను మాయమాటలతో మోసం చేయడమే కాదు ఇక హవాలా వ్యాపారం, నకిలీ నోట్ల వ్యాపారం కూడా జ్యోతిష్యుడు మురళీశర్మ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఇక మురళి శర్మ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. 18కోట్ల విలువైన నోట్లు లభ్యమైనట్లు తెలిపారు. ఇక మురళీశర్మ అనుచరులు ఢిల్లీ, ముంబై శాఖ తదితర ప్రాంతాల్లో నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఇక మురళి శర్మ ను రిమాండ్ కు తరలించిన పోలీసులు మరియు నిజాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మురళి శర్మ చదివింది పదో తరగతే అయినా ఇలా నకిలీ నోట్లు, హవాలా, రంగురాళ్ల మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు లు  పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: