ఆసుపత్రిలో దారుణం.. నిండు గర్భిణీపై అత్యాచారయత్నం..

Satvika
మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం ఎన్ని రకాల కఠిన చర్యలను తీసుకుంటూ వస్తున్నా కూడా ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటు. కామం తో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు వావి వరుసలు మరచి విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఒకవైపు కరోనా మహమ్మారి కొనసాగుతున్న కూడా ఇలాంటి అవమానకరమైన చర్యలు జరుగుతున్నాయి. రోజు జరిగే ఘటనలు ఒకరమైతే, ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం దారుణం అనే చెప్పాలి.


నిండు గర్భిణీ అని కూడా కనికరం లేకుండా ఓ కామాంధుడు అత్యాచార యత్నాని కి పయత్నించాడు. కరోనా టెస్ట్ కోసం అని పిలిచి ఇలా చేయడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన సూర్యాపేట లో వెలుగు చూసింది. రేపు డెలివరీ అని రాత్రి అత్యవసర కరోనా పరీక్షల కోసం ల్యాబ్ కు వెళ్ళింది. కోదాడ లోని ల్యాబ్ లో ఈ ఘటన జరిగింది.


స్థానికంగా ఉంటున్న తిరుమల ఆసుపత్రిలో ఈ నిర్వహం బయటపడింది. ఆసుపత్రి లోనే ఉన్న ల్యాబ్‌ టెక్నిషియన్ శ్రీకాంత్ అనే కామంధుడు ఆమెను ఓ గది లోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. అది గమనించిన మహిళా గట్టిగా కేకలు వేసింది. ఏమైందో అని ఆమె కుటుంబ సభ్యులు భయం తో లోపలి పరుగులు తీశారు. అక్కడ జరిగిన నిర్వహం చూసి షాక్ అయ్యారు. దాంతో అతన్ని చితకబాదారు. తర్వాత ఆమెను వేరే ఆసుపత్రి లో చేర్పించి వైద్యం చేయించారు. పోలీసులు, ఆసుపత్రి యాజమాన్య ఈ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకున్న మహిళా సంఘాలు రంగం లోకి దిగాయి. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.. స్థానికంగా ఈ దారుణ ఘటన కలకలం రేపుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: