పెళ్లికి సిద్ధమైన వరుడు.. బిడ్డతో ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు..చివ‌రికి !

MADDIBOINA AJAY KUMAR
పెళ్లికి సిద్ధమైన ఓ యువకుడికి ముహూర్తం సమయానికి షాక్ తగిలింది. వధువు ఇంట్లో వివాహానికి బయలుదేఋతున్న సమయంలో తనను ఇప్పటికే పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఓ గిరిజన మహిళ ఎంట్రీ ఇచ్చింది. దాంతో పీటలపైకి వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. ఉప్పల గుప్తం మండలం చల్లపల్లికి చెందిన అయ్యప్ప స్వామి రాజమహేంద్రవరంలో ఓ టీవీ ఛానల్ కి రిపోర్టర్ గా పని చేస్తున్నారు. అతడికి అయినమిల్లి గ్రామానికి చెందిన దగ్గరి బంధువుతో వివాహం కుదిరింది. వీరి పెళ్లి శుక్రవారం రాత్రి వధువు ఇంట్లో జరగాల్సి ఉంది. దాంతో శుక్రవారం ఉదయం అయ్యప్ప స్వామి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంటికి వచ్చిన బంధువులకు భోజనాలు పెట్టించాడు. ఇక పెళ్లికి భయలు దేరే సమయంలోనే ఏజెన్సీ ప్రాణతానికి చెందిన అడ్డతీగల గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళ 2ఏళ్ళ బిడ్డ తో వచ్చింది. 
అయ్యప్ప స్వామి తనను రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాడని ఇప్పుడు మరోపెళ్లికి సిద్ధమయ్యాడని వాగ్వాదానికి దిగింది.


అంతే కాకుండా స్థానిక ఉప్పల గుప్తం పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని పోలీసులను అభ్యర్థించింది. కానీ మహిళ వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు పెళ్లి ఆపేందుకు నిరాకరించారు. దాంతో సదరు మహిళ నేరుగా వధువు ఇంటికి వెళ్ళింది. అయ్యప్పతో తనకు ఇప్పటికే పెళ్లి జరిగిందని. తమకు 2 ఏళ్ల కుమారుడు ఉన్నాడని చెప్పింది. ఈ విషయం విన్న వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా  ధైలమా లో పడ్డారు. వివాదాలతో చివరికి  పెళ్లి ఆగిపోయింది. అయితే అప్పటికే మహిళ రాజమహేంద్ర వరంలోని దిశ పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా అమలాపురం డీఎస్పీ  వై.మాధవరెడ్డి ని కలిసి తన బాధను చెప్పుకుంది. ఇక ఇదే విషయంపై మీడియా తో మాట్లాడిన అయ్యప్ప తనకు మహిళతో పరిచయం ఉన్న మాట వాస్తవమేనని...కానీ ఆమెను పెళ్లి చేసుకోలేదని చెబుతున్నాడు. అంతే కాకుండా రెండేళ్ల బాబుతో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని...తన బిడ్డ కాదని వాదిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: