కరోనా రోగికి స్వర్గం చూపిస్తానంటూ వాలంటీర్ అరాచకం.. ఆపై..

Satvika
కరోనా వచ్చిందంటే అసలు అటువైపు కూడా వెళ్లరు.. అది ఒక ప్రాణాంతకరమైన వ్యాధి కావడం తో అయిన వాళ్ళు కూడా దగ్గరకు రాని రోజులివి.. అలాంటి సందర్భాల్లో కరోనా నుంచి కోలుకోవడానికి ఆసుపత్రికి వెళ్తున్న మహిళల పై ఆసుపత్రి సిబ్బంది నో లేక వాలంటీర్లు లేదా మగ నర్సులు లైంగిక దాడికి పాల్పడుతున్నారు.. ఇది సమాజం తలదించుకునే ఘటనలే.. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే పునరావృతం అవుతున్నాయి. మొన్న మహారాష్ట్ర లో జరిగిన ఘటన పూర్తిగా మరువక ముందే మరో ఘటన వెలులోకి వచ్చింది.


వివరాల్లోకి వెళితే.. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 45 మహిళ గత ఏప్రిల్ లో అనారోగ్యానికి గురైయ్యింది. అదే నెలలో వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్ అని తేల్చి చెప్పారు. అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నది. వివాహిత మహిళ దగ్గరే ఉంటూ ఆమెకు సహాయం చెయ్యడానికి ఆమె భర్తతో పాటు బంధువులు ఎవ్వరూ సాహసం చెయ్యలేకపోయారు.. అయితే ఆమెకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సీటీ స్కాన్ చేయాల్సి ఉంది.


అంబులెన్స్ ముందు సీట్లలో డ్రైవర్, ఆమె బంధువు ఒకరు కుర్చున్నారు. అంబులెన్స్ లోపల కోవిడ్ బాధితురాలు, కామాంధుడు ప్రశాంత్ ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారి మేడమ్, నా కోరిక తీర్చు, నీకు స్వర్గం చూపిస్తా, నీకు కరోనా వ్వాధి నయం చెయ్యాలని వైద్యులకు నేను సలహా ఇస్తానని ప్రశాంత్ అంబులెన్స్ లోపల కోవిడ్ బాధితురాలిపై లైంగిక దాడి చేశాడు. అంబులెన్స్ సీటీ స్కానింగ్ కేంద్రానికి వెళ్లే వరకు మెడికల్ అసిస్టెంట్ ప్రశాంత్ నరకాన్ని కళ్ళ ముందు చూపించాడు..లైంగిక దాడి జరిగిన సమయంలో మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో ఆ సమయంలో ఆమె వైద్యులకు కాని, పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేకపోయింది. మే 13వ తేదీన బాధితురాలు కోలుకునింది. తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని తాటను తీసే పనిలో ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: