13 ఏళ్ల బాలికపై ముగ్గురు అఘాయిత్యం.. చివరకి..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 13 ఏళ్ల బాలికకు ముగ్గురు మాయమాటలు చెప్పి సంగారెడ్డి జిల్లా నుంచి మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండల పరిధిలోని దుంపకుంట సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లారు. ఇక బాలికపై ముగ్గురు కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన బాలిక ఆలస్యంగా రావడంతో తల్లిదండ్రులు ఆ బాలికను నిలదీశారు. భయపడిపోయిన ఆ బాలిక ముగ్గురు వ్యక్తులు కలిసి నన్ను బలవంతంగా లాక్కెళ్ళి అత్యాచారం చేశారని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ జోగిపేటలో ఫిర్యాదు చేశారు.
ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఇంకా విచారణ కొనసాగతుందని వారికి సమాధానం చెబుతున్నారు. కానీ నిందితలు వద్ద లంచం తీసుకొని కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే నిందితుల వద్దనుండి డబ్బులు తీసుకొని ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇక విచారణ పేరుతో నిందితులను అదుపులోకి తీసుకోకుండా వారి వద్ద నుండి భారీ మొత్తంలో పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోందని వారు పేర్కొన్నారు. గత 15 రోజుల క్రితం అత్యాచారం చేసి చంపిన ఘటన లో నిందితులను తప్పుదారి పట్టించేందుకు వారి వద్ద నుండి పది లక్షల నుండి 15 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.