లిఫ్ట్ అడిగినందుకు చంపేసాడు.. అసలేం జరిగిందంటే..?
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తుంటే అసలు మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే లేదు అన్నది అర్ధమవుతుంది. సహాయం కోసం కోరిన వ్యక్తిని దారుణంగా కడతేర్చాడు ఒక వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. కళాశాపక్కం కు చెందిన శంకర్ అనే 43 ఏళ్ల వ్యక్తి చెన్నై కొత్తూరులో భవన నిర్మాణ పనులు చేస్తూ జీవిస్తున్నాడు అయితే ఇటీవలే అకస్మాత్తుగా శంకర్ ఈనెల 4వ తేదీన కొలతుర్ సమీపంలో రక్త గాయాలతో పడి ఉన్నాడు స్థానికులు అతన్ని గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధరించారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
అయితే పోలీసుల విచారణలో ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ హత్య ఎలా జరిగింది ఉంటుంది అనే విషయంపై అటు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా కొల్తూరు అంబేద్కర్ నగర్ కు చెందిన శశి కుమార్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వస్తుండగా అటువైపుగా వెళ్తున్న శంకర్ లిఫ్ట్ కోరాడు. అయితే ఈ విషయాన్ని ఆధారంగా తీసుకుని పోలీసులు విచారణ కొనసాగించారూ. శశి కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే లిఫ్ట్ ఇచ్చినందుకు శశికుమార్ డబ్బులు అడిగాడు ఇక పెట్రోల్ డబ్బులు ఇవ్వను అని చెప్పినందుకు దారుణంగా హతమార్చి నట్లు తెలుస్తుంది. శశి కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.