ట్రేడింగ్ పేరుతో మరోసారి రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు..

Satvika
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అయింది. ఈ మధ్య కాలంలో వీరి చేతిలో నష్టపోయిన వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రక రకాల విధంగా నేరాలకు పాల్పడుతున్నారు.ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో సైబర్‌నేరగాళ్లు మోసాలకు తెరలేపారు. హైదరాబాద్‌ అబిడ్స్‌కు చెందిన ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో పరిచయమై, తాము ట్రేడింగ్‌లో భారీ లాభాలు అర్జించి పెడుతామంటూ నమ్మించారు. ఆమె వద్ద నుంచి రూ.1.2 కోట్లు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులు రాహుల్‌ సిరస్వాల్‌ అలియాస్‌ రాహుల్‌, మహేశ్‌దేవ్‌లను నాలుగు రోజుల కిందట హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే..


ట్రేడింగ్ పెరుగుతూ భారీ మోసాన్ని చవి చూశారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మనించి మొత్తానికి టోపీ పెట్టారు.సుమిత్‌ వర్మతో పాటు మరో ఆరుగురు ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. సుమిత్‌ వర్మ గతంలో షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి గుర్తుతెలియని వ్యక్తులు ఇతడికి రూ.40 లక్షల వరకు మోసం చేశారు. పోయిన సొమ్మును తిరిగి రాబట్టుకోవడం కోసం సుమిత్‌ వర్మ మోసగాడిగా అవతారమెత్తాడు. దీంతో ముంబాయి స్టాక్‌ మార్కెట్‌లో తాము ట్రేడింగ్‌ చేస్తున్నామని ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే  లాభాలు వస్తాయని నమ్మించి మోసాలు చేశారు.


ముందుగా టెలికాలర్స్ తో తియ్యగా మాట్లాడించి తర్వాత బురిడీ కొట్టించారు.ట్రేడ్‌ 24 పేరుతో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి అందరిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌లో సాక్షి మెహత ఐడీతో వచ్చిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేసిన అబిడ్స్‌కు చెందిన మహిళ, తాను ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడుతానంటూ ముందుకు రావడంతో ఆమె వద్ద నుంచి భారీగా వసూలు చేశారు. ఈ ముఠా నాయకుడు సుమిత్‌, అజిత్‌లను చత్తిస్‌ఘడ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే కాల్‌సెంటర్‌ నిర్వాహకుడు అరస్టైనా, గ్యాంగ్‌ సభ్యులు మాత్రం తమ మోసాలను సాగించారు. హైదరాబాద్‌కు చెందిన మహిళ వద్ద, సుమిత్‌ అరెస్ట్‌ అయిన తరువాత కూడా డబ్బులు లాగేశారు. ఇలాంటి వాటికి చాలా మంది మోసపోయారు... పోలీసులు ఈ కేసును సీరియస్ కు తీసుకొని విచారణ చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: