ఇంట్లోనే మహిళ సగం కాలిన శవంలా.. అసలేం జరిగిందంటే..!
ఈ క్రమంలోనే ఎంబీయే చదివి ఖాళీగా ఉంటున్న ఆమె బాబాయి కొడుకు 24 ఏళ్ల జోసెఫ్ రిచర్డ్ ను తన ఇంటికి తెచ్చుకుంది. ఆమె బాగోగులు చూసుకోవడంతోపాటు, బయట అవసరమైన పనులను రిచర్డ్ చేసుకొచ్చేవాడు. ఏటీఎం నుంచి డబ్బులను కూడా డ్రా చేసి తీసుకొచ్చేవాడు. ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును చూసిన రిచర్డ్ లో ఆశ పుట్టింది.
దీంతో ఆమెకు తెలియకుండానే బ్యాంకు ఖాతాకు తన నెంబర్ ను అనుసంధానం చేసుకున్నాడు. దీంతో, ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసినా, ఆమెకు మెసేజ్ లు రాకుండా చేశాడు. ఇలా దాదాపు 5 లక్షల రూపాయలను ఆమె ఖాతా నుంచి పలుమార్లు విత్ డ్రా చేసుకున్నాడు. అతడు ఇంట్లో లేని సమయంలో అవసరం రీత్యా జూలియట్ బ్యాంకుకు వెళ్లి డబ్బు విత్ డ్రా చేసింది.
అప్పుడే తన ఖాతాలోంచి డబ్బు మాయం అయిందని గుర్తించింది. దీంతో ఈ విషయమై బ్యాంకు వాళ్లను ఆరా తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ పూర్తి చేసి ఎట్టకేలకు రిచర్డ్ ను అరెస్ట్ చేశారు. అయితే రెండ్రోజుల్లోనే బెయిల్ పై అతడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాతి రోజు రాత్రిపూట జూలియట్ ఇంటికి వెళ్లాడు. డబ్బు మాయం గురించి చేసిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని కోరాడు.
ఇక ఆమె వినకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఆమెను చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత ఇంటి లోపలి గడి పెట్టేసి, పక్క బిల్డింగ్ పైకి దూకి తప్పించుకున్నాడు. ఆమె మరణ వార్తను తెలుసుకున్న ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రిచర్డ్ పై అనుమానం ఉందని చెప్పడంతో ఆ దిశగా విచారణ ప్రారంభించారు. చివరకు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే చేసిన దారుణాన్ని బయటపెట్టాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.