
డిగ్రీ కుర్రాడు.. ఏడో తరగతి అమ్మాయి.. జంప్.. చివరికి ఏమైదంటే..?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని ఓ తండాకు చెందిన గణేష్ అనే యువకుడు డిగ్రీ చదువుకుంటున్నాడు. అతడి పక్కింట్లోనే ఉండే ఓ బాలిక ఏడో తరగతి చదువుకుంటోంది. పక్కపక్క ఇళ్లే కావడంతో వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. అది కాస్తా వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో గణేష్ ను వాళ్లు మందలించారు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. దీంతో గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గణేష్, ఆ బాలిక ఇద్దరూ కలిసి ఇళ్ల నుంచి ఎస్కేప్ అయ్యారు. తెల్లారిన తర్వాత ఈ విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆగ్రహించారు.
ఇక తమ కూతురిని ఎత్తుకెళ్లిపోయిన గణేష్ ఇంటిపై దాడిచేశారు. అడ్డొచ్చిన గణేష్ మేనమామ బానోత్ వీరన్నను కత్తితో పొడిచారు. ఇంట్లో ఉణ్న వస్తువులను ద్వంసం చేశారు. బీరువాలోంచి రెండు లక్షల రూపాయల డబ్బును, ఐదు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా గణేష్ కుటుంబానికి చెందిన పొలానికి వెళ్లి, అక్కడ వ్యవసాయ బోర్లను కూడా కాల్చేశారు. వాటి విలువ ఏకంగా రూ.6లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. కాగా, ఈ ఘటనపై అటు గణేష్ కుటుంబ సభ్యుల నుంచి కానీ, బాలిక కుటుంబ సభ్యుల నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.