ప్రేయసితో గొడవ.. యువకుడు చేసిన పనికి అందరు షాక్..?

frame ప్రేయసితో గొడవ.. యువకుడు చేసిన పనికి అందరు షాక్..?

praveen
ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకే ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ప్రేమించిన వాళ్ళతో జరిగిన చిన్న చిన్న గొడవలకి ఇక అక్కడితో జీవితం అయిపోయింది అనుకునే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్న తల్లిదండ్రులు వారి పై పెట్టుకున్న ఆశలను కనీసం గుర్తు చేసుకోకుండా చివరికి ప్రేయసి కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఇలా  ప్రేమించిన వారి కోసం ఆత్మహత్యలు చేసుకోవడమే కాదు ఇక ఆత్మహత్య చేసుకున్న సమయంలో సెల్ఫీ వీడియో తీసుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.


 ఇలా యువతీయువకులు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండిపోతుంది. ఇక ఇటీవలే ఓ యువకుడు సెల్ఫీ తీసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరులో వెలుగులోకి వచ్చింది. నరసరావుపేట మండలం గురువాయ పాలానికి చెందిన మహేష్ అనే వ్యక్తి బీటెక్ పూర్తి చేసి ఢిల్లీలోని నోయిడాలో ఉద్యోగం చేస్తూన్నాడు. అయితే చదువుకునే సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పడ గా ఇక ఆ తర్వాత కొన్నాళ్లకే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లపాటు వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు.



 ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ  ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చిన మహేష్ ఆత్మహత్యయత్నం చేయడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బోరంచ లోని ఐడి ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో గది తీసుకుని మహేష్ ఇక అక్కడ కూల్ డ్రింక్ లో  ఎలకల మందు కలిపి తాగాడు. అనంతరం బ్లేడ్ తో చేయి కోసుకున్నాడు ఇదంతా సెల్ఫీ వీడియో తీసాడు. సెల్ఫీ వీడియో కుటుంబ సభ్యులకు పంపాడు. అయితే గదినుంచి శబ్దాలు రావడంతో గమనించిన లాడ్జి సిబ్బంది తలుపులు పగలగొట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఇక మహేష్ ను వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: