
వేర్వేరు ఘటనల్లో నవ వధువులా ఆత్మహత్య.... ఆ కారణం చేతే..
మరో సంఘటనలో.. పెద్దలకు ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి.. పెళ్ళైన 4 నెలలకే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీలో జరిగింది. సాక్షి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలికి చెందిన మరియదాసు అనే వ్యక్తి లాక్ డౌన్ కారణంగా కృష్ణాజిల్లా గుడివాడలో ఉంటున్నాడు. అతడి కుమారుడు గోపి(21) తన తండ్రి వద్దకు వచ్చి కొన్నాళ్లు ఇక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో పక్కింట్లో నివసించే పూర్ణకంటి సాహితి (18)ని ప్రేమించాడు. పెద్దలకు ఇష్టం లేకపోయినా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తన భార్యను కంచర్లపాలెం తీసుకెళ్లాడు. ఆదివారం రాత్రి ఆ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్తామామలే ఆమెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాహితికి ఇంకా మైనారిటీ తీరలేదని సమాచారం.
భారత ప్రభుత్వం గృహహింసని నేరంగా గుర్తించి గృహహింస నిరోధక చట్టం 2005ని తీసుకొచ్చింది. నేరం చేసిన వాళ్ళను దండించడం కాకుండా బాధితులకు (స్తీలకు) ఉపశమనం కల్పించేదిశగా ఈ చట్టం ఏర్పడింది. తన కుటుంబానికి సంబంధించినవారు, తన కుటుంబంలోని మగవారు జరిపే ఎటువంటి హింస నుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పాటు చేయటం జరిగింది.అంత కముందు వరకట్న వేధింపుల చట్టం (490ఎ) మాత్రమే ఉంది. వివిధ రకాలుగా గృహాల్లో వేధించబడి నిస్సహాయతకు గురైన మహిళకు అండగా నిలబడి న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించరన్నారు. మహిళలను శారీరకంగా, మానసికంగా హింసించడం, బాధించడం, కించపరచడం, ఆర్ధిక ఇబ్బందులు కలిగించడం, బెదిరించడం, దౌర్జన్యానికి పాల్పడటం ఇవన్నీ గృహహింస పరిధిలోకి వస్తాయి. దీనిపై అవగాహన లేకే చాలా మంది గృహిణులు ఆత్మహత్యకు పాల్పడుతుండటం బాధాకారమని సామాజిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.