భార్యను చంపాలని చూసిన లాయర్.. మహిళ 10 ఏళ్ల పోరాటం.. చివరకి..!?

Suma Kallamadi
సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి భార్య ప్రేమగా చేసుకోవాల్సింది పోయి భార్యను చిత్ర హింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా  భార్యను చంపాలని చూసిన ఓ లాయర్‌కు కోర్టు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. అలాగే అతడికి రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. ఈ మేరకు అడిషనల్ సెషన్స్ జడ్జ్ పీపీ జాదవ్ తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి బాధితురాలి తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హేమ్‌లత దేశ్‌ముఖ్ కోర్టులో వాదనలు వినిపించారు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భీవండి ప్రాంతాలనికి చెందిన లాయర్ అహ్మద్ అసిఫ్‌కు 2001లో బాధిత మహిళతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అహ్మద్ తన భార్యను తీవ్రంగా హింసించేవాడు. దీంతో ఆమె పిల్లలతో కలిసి వేరుగా ఉండటం ప్రారంభించింది. అలాగే భర్తపై వరకట్న వేధింపులు, గృహ హింసకు సంబంధించి కేసు నమోదు చేసింది. అలాగే తన పిల్లలను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది.

అయితే  2011 ఫిబ్రవరి 11న ఈ కేసు గురించి చర్చించడానికి అహ్మద్ అడ్వకేట్ కార్యాలయానికి వెళ్లింది. అయితే అక్కడికి వచ్చిన అహ్మద్.. ఆమెపై దాడికి యత్నించాడు. ఆమెను తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. కానీ ట్రిగ్గర్ స్ట్రక్ కావడంతో అతని ప్రయత్నం విఫలం అయింది. అయితే ఆ తర్వాత అతడు మహిళపై కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

దీంతో అక్కడ ఉన్న ఇతర లాయర్లు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులకు ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆ తర్వాత అహ్మద్‌పై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఇక, గురువారం ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది. అయితే తీర్పు వెలువరించే సమయంలో అహ్మద్ కోర్టులో లేకపోవడంతో న్యాయమూర్తి అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: