రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లి హత్య కేసులో షాకింగ్ విషయాలు భయటకు వస్తున్నాయి. ఇద్దరు తల్లి తండ్రులు ఉన్నత విద్యావంతులు..ఏకంగా ఓ విద్యాసంస్థనే నడుపుతున్నారు. వేల మందికి విద్యను అందించారు. కానీ చివరికి కన్న బిడ్డ లనే హత్య చేసే స్థాయికి వచ్చారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఘటన అనంతరం మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ పరిస్థితి చూసిన ఆయన షాక్ కు గురయ్యారు. రెండు హత్యలు పూజాగదిలోనే జరిగినట్టు పోలీసులు గుర్తించారు. తమ పిల్లలు చనిపోలేదని..తెల్లారేసరికి బతుకుతారని తల్లి తండ్రులు వాదిస్తున్నారు. డంబెల్ తో తల్లి సుప్రజ ఇద్దరు కూతుళ్లను కొట్టి చంపింది. కాగా ఆమెకు భర్త పురుషోత్తం నాయుడు కూడా సహకరించాడు. పిల్లలను చంపే ముందు ఇద్దరు కూతుళ్లను నగ్నంగా ఉంచి తల్లి పూజలు చేసింది. చంపే ముందు ఇద్దరి నోర్లలో ఇత్తడి కుండలను ఉంచారు. తల్లి తండ్రులిద్దరూ మెహర్ బాబా శిష్యులని తెలిసింది. మా కూతుళ్లు చనిపోలేదని మళ్ళీ తిరిగి వస్తారని తల్లి తండ్రులు వాదిస్తున్నారు. తమ బిడ్డలిద్దరూ పడుకున్నారని తిరిగి లేస్తారని పోలీసులతో వాదించారు. తమ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిహాయని..తమ కూతుళ్లు కూడా పునర్జన్మను పొందుతారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నాలుగైదు గంటల వరకు తమను డిస్ట్రబ్ చేయవద్దని తల్లిదండ్రులు పోలీసులను కోరడం జరిగింది. ఆంటే అంతే కాకుండా పోలీసులపైనే కేసు పెడతామని తల్లి తండ్రులు వాదించినట్టు తెల్సుస్తోంది. తమ ఇంట్లో సూపర్ పవర్ ఉందని ... ఈరోజుతో కలియుగం అంతం అవుతుందని తల్లి తండ్రులు పొంతనలేని మాటలు మాట్లాడినట్టు పోలీసులు చెబుతున్నారు. తల్లి తండ్రులు ఇద్దరు ప్రముఖ విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్ ను నడిపిస్తున్నారు. వీళ్ళ వద్ద వేలమంది విద్యార్థులు చదువు నేర్చుకున్నారు. మృతోల్లో దివ్య ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటుంది. పెద్ద కూతురు అలేఖ్య భోపాల్ లో ఎంబీఏ చేసి జాబ్ చేస్తుంది. ఇటీవల కరోనా టైం లో ఇద్దరు కుమార్తెలు ఇంటికి వచ్చారట. ఈ మధ్య తల్లి తండ్రులు ట్రాన్స్ లోకి వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. తల్లి సుప్రజ మానసికవ్యాధితో బాధపడుతోందని చుట్టుపక్కలవారు చెబుతున్నారు. ఈ ఘటనపై మదనపల్లి పోలీసులు విచారణ మొదలు పెట్టారు. హత్యకు తల్లి తండ్రుల మానసిక పరిస్థితే కారణమా..ఇంకా వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా.?అన్న దానిపై విచారణ జరుపుతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: