ఒకరిని కాపాడబోయి ఒకరు...విద్యుత్ షాక్ తో నలుగురి మృతి..

Spyder
మహబూబాబాద్‌ జిల్లా అమనగల్లులో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు.  రెండు కుటుంబాలకు చెందిన నలుగురిలో రెండు జంటలు ఉండడం విషాదకరం. మహబూబాబాద్‌ మండలంలోని అమనగల్‌ గ్రామానికి చెందిన రైతు దంపతులు చెన్నబోయిన సత్తయ్య(52), రాధమ్మ(48)తో పాటు దాసరి లింగయ్య(55), లక్ష్మి(50) ఈ ఘటనలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సత్తయ్య-రాధమ్మ దంపతులు వారి ఇంటి వద్ద బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో ఒక్కసారిగా కిందపడిపోయారు. ఎదురింట్లో ఉంటున్న లింగయ్య-లచ్చమ్మ దంపతులు గమనించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు.


ఈ క్రమంలో అనూహ్యంగా వారు కూడా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కసారిగా రెండు కుటుంబాలకు చెందిన నలుగురు చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్న చెన్నబోయిన సత్తయ్య శనివారం రాత్రి స్నానం చేసి లోదుస్తులను ఆరు బయట ఉన్న జె వైరుపై ఆరవేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై కేకలు వేశాడు. వెంటనే అతడి భార్య రాధమ్మ భర్తను రక్షించే క్రమంలో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఇరువురి కేకలు విని ఎదురింట్లో ఉంటున్న దాసరి లింగయ్య, లక్ష్మి దంపతులు వెంటనే వచ్చి సత్తయ్య, రాధమ్మను  కాపాడే ప్రయత్నం చే శారు.


ఈ క్రమంలోనే అందరు కు ప్పకూలారు. మొదట విద్యుదాఘాతానికి గురైన సత్తయ్య, రాధమ్మలు అక్కడికక్కేడే మృతిచెందగా, విద్యుదాఘాతంతో తీవ్ర అస్వస్థతకు గురైన దాసరి లింగ య్య, లక్ష్మిలను మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు.  మృతులు సత్తయ్య, రాధమ్మ దంపతులకు ఇరువురు కుమార్తెలు కాగా, ఒక్క అమ్మాయి వివాహం జరిగింది. దాసరి లింగయ్య దంపతుల కుమారుడు ఆర్మీలో పని చేస్తుండగా కుమార్తె స్థానికంగానే ఉంటోంది. విద్యుత్ ఘాతానికి గురై సత్తయ్య-రాధమ్మ, లింగయ్య-లచ్చమ్మ నలుగురు చనిపోవడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మానుకోట యంపి మాలోత్.కవితలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరుపున ఆ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: