తాగి వాహనం నడిపితే ఇక మాములుగా ఉండదు!

SS Marvels

మీరు మద్యం సేవించి వాహనం నడిపితే ఇక మీ పని అంతే... నగర పోలీసులు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో పోలీసులు వీటిపై దృష్టి పెట్టారు. తాగి బండి నడిపితే ఇక వాళ్ల ఆఫీసులకు నేరుగా సమాచారం వెళుతుంది. మొదటిసారి పట్టుబడితే రూ.10 వేల ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష మూడు నెలల లైసెన్స్ రద్దు చేస్తారు. అదే విధంగా రెండోసారి పట్టుబడితే రూ.15 వేల‌ ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష శాశ్వత లైసెన్స్ రద్దు చేస్తారు. పబ్బులు బార్లు‌ ఎక్కువగా ఉండే సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు అధికం అవుతున్నాయి.






ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఒక్క డిసెంబర్‌లో 2,351 కేసులు నమోదయ్యాయి. రాచకొండలో ఈ ఏడాదిలో 3,287 కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనం నడిపించేవారి సమాచారం ఇప్పుడు నేరుగా వారి పనిచేసే ఆఫీసులకు వెళుతుంది. అంతేకాకుండా వారి లైసెన్స్‌ను రద్దు చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇందులో అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అందుకని ఇటువంటి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇక ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి కొత్త రూపు సంతరించుకుని భయపెడుతున్న వేళ.. హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలపై తెలంగాణ సర్కారు నిషేధం విధించిన విషయం విదితమే.. కొత్త ఏడాది సందర్భంగా పబ్లిక్, ఎంటర్‌టైన్మెంట్ వేడుకలకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇప్పటికే స్పష్టం చేశారు. రిసార్టులు, పబ్‌లపై నిఘా పెట్టామని.. పబ్‌లు, క్లబ్‌లకు అనుమతి లేదని సజ్జనార్ వెల్లడించారు. అలాగే నగరంలో డ్రంకన్ డ్రైవ్ టెస్టులు ప్రారంభించామని, తాగి వాహనం నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించిన రెండు రోజులకే ఇప్పుడు ఇలా తాగి దొరుకుతుండటంతో పలువురు విస్మయం చెందుతున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: