వాడుకుని వదిలేసాడు, తల్లి అయింది, చివరికి...!

Gullapally Rajesh
ప్రేమ విషయంలో చాలా మంది గుడ్డిగా వెళ్తూ ఉంటారు. వారికి పాపం జరిగే నష్టాల మీద కూడా అవగాహన అనేది ఉండదు. మన దేశంలో ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్యలు చేసుకునే వారు ఎక్కువగానే కనపడుతూ ఉంటారు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇక గర్భం దాల్చిన తర్వాత మోసం చేసి వదిలేసే బ్యాచ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత వాడుకుని వదిలేసే వారు మనకు కనపడుతూ ఉంటారు. పోలీసులు కఠినం గా ఉన్నా సరే కొందరిలో మార్పు అనేది అసలు రాలేదు.

ఇక చట్టాలకు కూడా భయపడకుండా ఉంటారు. ఇలా మోసపోయి జీవితాలను నాశనం చేసుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు.  తాజాగా తెలంగాణాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురించి తెలిస్తే కచ్చితంగా కన్నీళ్లు పెట్టడం ఖాయం. అసలు ఏం జరిగింది ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే... తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాలలోని ధర్మపురిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరు తో మోసపోయిన మైనర్ బాలిక గర్భం దాల్చింది. గర్భం దాల్చి రెండు రోజుల క్రితం శిశువుకు జననం ఇచ్చింది.

నెలలు నిండక ముందే ప్రసవించిన బాలిక ఆరోగ్యం విషమంగా మారింది. దీనితో ఆ బాలిక తల్లి  ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక సొంత వైద్యం చేసింది. ఆ వైద్యం ఫలించక శిశువు సహా బాలిక మృతి చెందింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. స్మశాన వాటికలో పూడ్చి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. పూడ్చి పెట్టిన చోటి నుంచి బాలికను బయటకు  తీసారు. శిశువు కోసం  గాలించినా ఇంకా దొరకలేదు అని తెలుస్తుంది.  తల్లిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితుల కోసం ఇంకా గాలిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: