సెల్ ఫోన్ మార్చినట్లుగా ప్రియున్ని మార్చింది.. చివరికి..?

praveen

అంతా ప్రశాంతంగా ఉంది... పక్కనే ఉన్న గోనెసంచిలో  నుంచి ఏదో దుర్వాసన.. ఏంటో అని స్థానికులు తెరిచి చూశారు. ఒక్కసారిగా షాక్... అందులో మనిషి మృతదేహం.. తెరిచిన వారికి కాళ్ళు చేతులు ఆడలేదు.. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మొన్నటికి మొన్న గుంటూరు నగరంలో గోనెసంచిలో లభించిన ఓ వ్యక్తి మృతదేహం స్టోరీ ఇది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకొని ముమ్మర దర్యాప్తు చేపట్టారు, ఇక మృతుడు గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ కు చెందిన పురుగుల మందు వ్యాపారి మోదుగుల పూర్ణచంద్రరావు గా పోలీసులు నిర్ధారించారు. 

 


 ఇంతకీ ఏం జరిగింది...?  అతను ఎందుకు హత్య చేయబడ్డాడు..? అనే కోణాల్లో  పోలీసులు విచారణ ప్రారంభించగా విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. పురుగుల మందు వ్యాపారం చేసే పూర్ణచంద్రరావు స్టాక్ అయిపోవడంతో పురుగుల మందు కోసం బుధవారం ఇంటి నుంచి బైక్ తీసుకొని గుంటూరు బయలుదేరాడు. అంతే వెళ్ళిన వాడు అటు నుంచి అటే పైలోకాలకు వెళ్ళాడు. కానీ మళ్ళీ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కేసు విచారణలో ఎన్నో నిజాలు బయటపడ్డాయి. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణం అయి ఉంటుందని  పోలీసులు ముందుగా అనుమానించారు.

 

 అయితే పురుగుల మందు వ్యాపారం చేసే పూర్ణచంద్రరావు కు గుంటూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ తో పరిచయం ఏర్పడగా అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్ల వరకు వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఇటీవలే ఆ మహిళ ఏకంగా సెల్ ఫోన్  మార్చినట్లు గా ప్రియున్ని  మార్చేసింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధానికి తెరలేపింది. ఈ విషయం పోలీసు విచారణలో తేలింది. పూర్ణచంద్రరావుతో  అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళే అతన్ని  చంపి ఉండొచ్చు అని పోలీసులు అనుమానించారు. ఇక ఈ క్రమంలోనే మహిళ భర్త పై అనుమానపడ్డారు పోలీసులు. ఇక ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపగా అసలు నిజం బయటపడింది... పూర్ణచంద్రరావు ప్రియురాలు ఆమె కొత్త ప్రియుడితో కలిసి... పూర్ణచంద్రరావును  హత్య చేసినట్లు నిర్ధారణ అయింది.దీంతో  ఇద్దరిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: