భార్యాభర్తలు మరణం..! హత్య జరిగిందా..?

Suma Kallamadi

తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. భార్యా భర్తలిద్దరూ కూడా మరణించారు. నగరానికి వలస వచ్చిన ఈ దంపతులు విగత జీవులుగా కనిపించారు. అయితే అసలు ఏం జరిగింది...?  వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం నుంచి ఒక జంట హైదరాబాద్ కి వలస వచ్చారు. అయితే పొట్ట చేత పట్టి నగరానికి వచ్చిన ఈ జంట ఇప్పుడు కన్నుమూసారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో  చోటు చేసుకుంది. భర్త బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు . భార్య అనుమానాస్పద రీతిలో విగతజీవిగా కనిపించింది.

 

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగేశ్వరరావు తన భార్యతో పదేళ్ల నుంచి హైదరాబాద్ లోని  పంజాగుట్ట పరిధి లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు . వాళ్లకి ఇద్దరు కొడుకులు. హఠాత్తుగా ఈ దంపతులు విగతజీవిగా మారారు. నిజంగా ఈ ఘటన ఒక మిస్టరీగా మారింది. భర్త బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టంగా తెలిసినదే . భార్య మాత్రం విగతజీవిగా కనిపించింది. తన భార్య రోజా అనుమానాస్పద స్థితిలో ఇంట్లో శవమై తేలింది అయితే పోలీసులు తన భర్తే ఆమెను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు ఏమో అని అనుమానిస్తున్నారు.

 

భార్య ఒంటి పై ఎటువంటి గాయాలు లేవని ఆమెని దిండుతో గట్టిగా అదిమి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానాలను వ్యక్తం చేశారు. ఇలా కాకుంటే ఛాతి పై కొట్టి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.   ఇలా ఆమెని హత్య చేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. భార్యను హత్య చేసిన అనంతరం భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: