మొక్కల తో చికెన్ చేయడం ఎప్పుడైనా విన్నారా?

Satvika
నాన్ వెజ్ అంటే చికెన్ అని అందరికి తెలుసు. అయితే, ఇప్పుడు కొత్తగా మొక్కల తో కూడా చేస్తున్నారు.. అందుకు ప్రముఖ బ్రాండ్ కె ఎఫ్ సి ఇలాంటి కొత్త వంటను పరిచయం చేసింది.వీటికి చాలా పేరు వుంది. ఒక్క లెగ్ పట్టుకుంటే అలా నోట్లోకి జారిపోతుంది.కంపెనీ పేరులోనే ఫ్రైడ్ చికెన్ ఫేమస్ అయ్యింది. కె ఎఫ్ సి నాన్ వెజ్ ప్రియులకు కె ఎఫ్సి లెగ్స్ అంటే ప్రాణం పెడతారు.  చికెన్ తింటుంటే ఆ మజానే వేరు. కానీ నాన్ వెజ్ తిననివారికి కూడా చక్కటి మజా అందిస్తామంటోంది కె ఎఫ్ సి. అదే వెజ్ చికెన్. వెజ్ ఏంటీ చికెన్ ఏంటీ? ఫుల్ డిఫరెంట్ గా ఉందే అనుకుంటున్నారా? కాస్త వెరైటీగా వుంది అని అనుకుంటారు. కదూ అవును ఇది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఇంత పేరు వున్న ఈ కంపెనీ కొత్త చికెన్ ను పరిచయం చేసింది.బియోండ్ ఫ్రైడ్ చికెన్ గురించి ప్రకటించింది…నాన్ వెజ్ తిననివారికంటే వీగన్లు మరీ దారుణం..వీరు కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. కనీసం పాలు పాల పదార్ధాలు కూడా తినరు. మరి వీగన్లకు ప్రొటీన్లు ఎలా లభిస్తాయి?మాంసం, చికెన్‌లో ఉండే ప్రోటీన్లు… వెజ్, వేగన్ ప్రియులకూ కూడా అందేలా చేయటానికే మొక్కల ఆధారిత ఫ్రైడ్ చికెనే అంటోంది కె ఎఫ్ సి.. ఈ చికెన్ రేపటి నుంచి అందుబాటులోకి వస్తుంది.

మొక్కల చికెన్ రియల్ చికెన్ లాగానే కనిపిస్తుందనీ కాబట్టి అది పక్కా చికెన్ అని అనుకోద్దని సూచించింది. వీగన్లూ, వెజియేరియన్లూ తినే ఆహారం లాగా ఇది కనిపించదని తెలిపింది. కాబట్టి ఇది వెజ్ ప్రియులు, వీగన్లకు నచ్చుతుందా? వాళ్లు దీన్ని ఏక్సప్ చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.. అయితే ఇప్పుడు నాన్ వెజ్ ను చుస్తున్న భోజనం ప్రియులకు ఇటువంటివి ఇష్టపడతారా? లేదా అన్నది రేపు తెలియనుంది.2019 ఆగస్టులోనే అమెరికాలోని అట్లాంటాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అది 2020లో నాష్‌విల్లే, చార్లొట్టే, దక్షిణ కాలిఫోర్నియాలకు విస్తరించింది.ఈ మొక్కల చికెన్ వివిధ రకాలుగా పొందవచ్చు అని కె ఎఫ్ సి పెర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: