టేస్టీ, క్రంచీ పొటాటో టాట్స్... పిల్లల ఫేవరెట్ రెసిపీ

Vimalatha
కూరగాయలలో బంగాళ దుంపలను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడే బంగాళా దుంపలతో చేసిన వంటకాన్ని ఈరోజూ మీ కిచెన్ లో మీరు తయారు చేయండి. కేవలం టేస్ట్ పరంగానే కాకుండా బంగాళ దుంపలు చాలా శక్తిని కలిగించే కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. అలాగే దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ సారి సాయంత్రం బ్రేక్ ఫాస్ట్ కోసం పిల్లలకు, పెద్దలకు అందరికీ బంగాళ దుంపలతో చేసిన పొటాటో టాట్స్ సిద్ధం చేయండి. పొటాటో టాట్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
బంగాళా దుంప టోట్స్ చేయడానికి మూడు నుండి నాలుగు బంగాళ దుంపలు, నాలుగు టీస్పూన్ల కార్న్‌ఫ్లోర్, దంచిన ఎర్ర మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి అవసరం. రెండింటినీ తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. రుచికి ఉప్పు, వేయించడానికి నూనె, బ్రెడ్ ముక్కలు కూడా కావాలి.
బంగాళా దుంప టోట్స్ చేయడానికి ముందుగా బంగాళా దుంపలను తొక్కలని తీసి బాగా కడగాలి. అప్పుడు దాని పిండి పదార్ధం తొలగి పోతుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బాణలిలో నీటిని వేడి చేసి ఈ ముక్కలను అందులో వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. బంగాళ దుంపలు కాస్త చల్లారాక మెత్తగా చేయాలి. ఇప్పుడు దానికి కార్న్‌ఫ్లోర్, దంచిన ఎర్ర మిరపకాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. రుచి ప్రకారం ఉప్పు వేయండి. తర్వాత వీటన్నింటిని మిక్స్ చేసి గుండ్రని బంతుల ఆకారంలో చేయండి.
ఇప్పుడు ఈ బాల్స్ అన్నింటినీ ఒక ప్లేట్‌లో ఉంచండి. ఒక ప్లేట్‌లో కొన్ని బ్రెడ్ పొడిని తీసి ఉంచండి. ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్ ను నీటితో పలుచగా కలిపి సిద్ధం చేయండి. బాణలిలో నూనె వేసి వేడి చేయండి. ఈ నూనె వేడిగా అయ్యాక బంగాళాదుంప బాల్స్‌ను ముందుగా కార్న్‌ఫ్లోర్ లో ముంచి బ్రెడ్ పొడిలో వేయండి. బంగాళాదుంప బాల్స్‌పై దాని పొర బాగా అంటుకున్నాక వాటిని నూనెలో వేయాలి. అదేవిధంగా మిగిలిన అన్ని బాల్స్ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అంతే బంగాళ దుంప టోట్స్ సిద్ధం. వాటిని గ్రీన్ చట్నీ లేదా కెచప్‌తో క్రిస్పీ వేడిగా సర్వ్ చేయండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: