రాజ్మా మసాలా వైపు ఒక లుక్ వేదామా

Manasa
రెగ్యులర్ గా కూరగాయలతో  చేసే కర్రీ కాకుండా ఈరోజు రాజ్మా తో మసాలా ఎలా చేయాలో తెలుసుకుందాం..


 రాజ్మా మసాలా తయారీకి కావలసిన పదార్థాలు:

 రాజ్మా :100 గ్రామ్స్

 ఉల్లిపాయలు: 2

 టొమాటోలు : 2

 పుదీనా : కొద్దిగా 

 పచ్చిమిరపకాయలు : 4

 కొత్తిమీర  :కొద్దిగా

 ఉప్పు : రుచికి సరిపడా

 కారం : 2 టేబుల్ స్పూన్లు

 గరంమసాలా :1 టీ స్పూన్

ధనియాల పొడి :1 టీ స్పూన్

 జీరా పొడి:1 టీ స్పూన్

 బే లీఫ్ : 1

 దాల్చనచెక్క : ఒక్కటి చిన్న ముక్క.

పసుపు :చిటికెడు 

ఇంగు : చిటికెడు

 ఆవాలు : 1 టీ స్పూన్

జీలకర్ర:1 టీ స్పూన్

నూనె: తగినంత 

 అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్ 


రాజ్మా మసాలా తయారు చేసే విధానం:


రాజ్మా మసాలా చేసే కన్నా ఒక రోజు ముందు, రాజ్మాను నీళ్లలో లో నానబెట్టుకోవాలి. అలా నానిన రాజ్మా ను 12 విజిల్స్ కు కుక్కర్ లో పెట్టుకొని  రాజ్మాను  ఉడకనివ్వాలి.( రాజ్మా ని ఉడికించిన నీళ్ళు పక్కకు  తీసి పెట్టుకోవాలి)

ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని  దానిలో కర్రీ కి సరిపడా నూనె వేసి  కాగనివ్వాలి.

తర్వాత కాగిన నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు,1 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాలచినచెక్క, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. ఎప్పుడు దానిలో కట్ చేసి పెట్టుకుని  2 ఉల్లిపాయ ముక్కలు,2 టమాటా ముక్కలు వేయాలి.

అవి ఫ్రై అవుతున్నపుడు 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, మీ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.ఎప్పుడు ఇందులో  ముందుగా  ఉడికించుకున్న రాజ్మా ను వేసుకోవాలి. రాజ్మా ఉడికించి కొన్నప్పుడు వచ్చిన నీరు పోసుకొని  కొత్తిమీర మరియు పుదీనా వేసి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి.

ఎంతో రుచికరమైన మసాలా  రాజ్మా రెడీ.దీనిని చపాతీ తో కాని పూరి  తో కాని తింటే చాలా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: