బూడిద గుమ్మడి కాయ తో ఈ వంటకం ఎప్పుడైనా చేశారా?

Manasa
బూడిద గుమ్మడి కాయ తో కర్ణాటక డిష్ "కూటు"ను ఎలా చేయాలో ఈరోజు ఓ లుక్ వేద్దామా?


కూటు తయారీకి కావాల్సిన పదార్థాలు:

బూడిద గుమ్మడికాయ  ముక్క:1/4  కే.జి.

బంగాళాదుంప : 1  మీడియం సైజు 

కారట్ : 2  మీడియం సైజు 

టమాటాలు : 2 మీడియం సైజు

కంది పప్పు : 1  కప్పు 

పల్లీలు :1/2  కప్పు

చెనగపప్పు : 2 టీ స్పూన్లు.

మినప్పప్పు : 2 టీ స్పూన్లు

జిలకర : 1 టీ స్పూన్ 

ధనియాలు : 2  టేబుల్ స్పూన్లు 

మిరియాలు :8 

తోక మిరియాలు :4 

ఎండు మిరపకాయలు :12 -15 

ఎండు కొబ్బరి :చిన్న ముక్క 

చింతపండు : నిమ్మకాయంత

ఉప్పు: తగినంత 

నూనె :6-7  టేబుల్ స్పూన్లు 

పసుపు : 1 టేబుల్ స్పూన్లు 

ఇంగువ : 1/2 టీ స్పూన్

ఆవాలు: 1టీ స్పూన్


మసాలా తయారీ విధానం:

 2 టీ స్పూన్లు సెనగపప్పు, 2 టీ స్పూన్లు మినప్పప్పు, 1టీ స్పూన్ జిలకర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు,8 మిరియాలు,4 తోక మిరియాలు, 12 -15ఎండు మిరపకాయలు, చిన్న ఎండు కొబ్బరి ముక్క  తీసుకుని మిక్సీలో వేయాలి. దీనిలో కొన్ని నిన్ను పోసుకుంటూ చిక్కటి పేస్ట్ లాగా చేసుకోవాలి.


కూటు తయారు చేసే విధానం: 

చింతపండును నానా పెట్టుకోవాలి.1/4  కే.జి. బూడిద గుమ్మడికాయ ను ముక్క ను పొట్టు తీసి  పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి  నీళ్లలో ఉడికించుకొని, నీళ్ళని వంపేయాలి. 1  మీడియం సైజు బంగాళాదుంపను, 2  మీడియం సైజు క్యారెట్లను పొట్టు తీసి పెద్ద ముక్కలుగా  తరుగు కోవాలి.2 మీడియం సైజు టొమాటోలను మీడియం సీజీలో కట్ చేసుకోవాలి.

 1 కప్పు కంది పప్పు, కొన్ని పల్లీలు వేసి పప్పులాగా ఉడికించుకోవాలి.

ఒక బాణలిలో 2 -3  టేబుల్ స్పూన్లు నూనె వేసి అందులో  బంగాళదుంప, క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేస్తుండాలి, అది ఉడికిన తర్వాత అందులో టమాటా ముక్కలు, బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసి చిటికెడు పసుపు, నానబెట్టుకున్న  చింతపండు గుజ్జు తీసి వేయాలి. ఏది మరుగుతున్నప్పుడు మనం చేసి పెట్టుకుని మసాలా పేస్ట్ వేసి కలపాలి. ఒక 2  నిమిషాల తరువాత ఉడికిన పప్పు దీనిలో వేయాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి  అది దగ్గరికి అవగానే స్టవ్ మీద నుంచి దింపేయాలి.

ఒక చిన్న బాణలిలో 3  టేబుల్ స్పూన్లు నూనె,1/2 టీ స్పూన్లు ఇంగువ, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1  స్పూన్ , పల్లీలు వేసి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపును వేడి వేడి కూటు మీద వేసి మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేయవచ్చు.

కర్ణాటక స్పెషల్ "కూటు" రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: