మష్రుమ్ తో ఎప్పుడైనా ఇలాగ ఫ్రైడ్ రైస్ తయారుచేసి చూడండి....!
తయారి విదానం:ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యీ, నూనె వేసి వేడి అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసి వేయిoచాలి.తర్వాత అల్లం పేస్టు వేసి వేయిoచాలి.తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోవాలి.తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి. తర్వాత బటన్ మష్రుమ్ వేసి మష్రుమ్లోని వాటర్ పోయే వరకు వేయిoచాలి.తర్వాత రెడ్ కాప్సికం ముక్కలుగా వేసి ఒక సారి కలిపాక,క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.తర్వాత ఇందులో ఫ్రోజెన్ బీన్స్ వేసుకోవాలి.మొత్తం ఒకసారి కలిపాక సోయాసాస్,వెనిగర్ వేయాలి.వాటన్నిటిని ఒకసారి కలిపాక టమోటో సాస్ వేసి కలపాలి.తర్వాత ఉడికించిన రైస్ వేసి కలుపుకోవాలి.చివరగా పెప్పర్ పౌడర్ వేసి కలుపుకున్నాక చివరలో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి.అంతే ఎంతో రుచికరమైన మష్రుమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మష్రుమ్ తో ఎప్పుడైనా ఇలాగ ఫ్రైడ్ రైస్ తయారుచేసి చూడండి.ఈ ఫ్రైడ్ రైస్ ని మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు.ఈవెనింగ్ స్నాక్స్ టైంకి చూసుకుంటే పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మంచి స్నాక్స్ ఇవ్వొచ్చు.అంతే కాకుండా ఎక్కువ సమయం లేనపుడు,సరియైన కూరగాయలు అందు బాటలో లేనపుడు, ఉదయం లంచ్ బాక్స్ లలోకి ఈజీగా తయారు చేసుకోవచ్చు.