కొబ్బరితో టేస్టీగా ఉండే పచ్చడి చేద్దామా.. !

Suma Kallamadi
ప్రతిరోజు కూర ఏమి తింటారు చెప్పండి. ఒక ముద్ద అయిన పచ్చడితో తిని చూడండి. చెప్పబడిన నోటికి మళ్ళీ పచ్చడి రుచి చూపించండి. ఎంచక్కా వేడి వేడి అన్నంలో చెంచా నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకుని తింటే వచ్చే రుచే వేరుగా ఉంటుంది. అందుకే ఈ రోజు మనం కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. కొబ్బరికాయ అంటే గుర్తుకొచ్చింది ప్రతి రోజు మనం దేవుడికి పూజ చేసేటప్పుడు తప్పకుండా కొబ్బరికాయలు కొడతాము కదా. మరి ఆ కొబ్బరి చిప్పలతో అదిరిపోయే చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.


కావలసిన పదార్ధాలు:


కొబ్బరికాయ - ఒకటి
ఎండుమిరపకాయలు -3
పచ్చిమిరపకాయలు -10  
నాన బెట్టిన చింతపండు కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకు - 2 రెమ్మలు
ఆవాలు -1 టీ స్పూన్
జీలకర్ర -1 టీ స్పూన్
సాయి మినపప్పు -1 టీ స్పూన్
నూనె/నెయ్యి ఒక స్పూను
కరివేపాకు -కొద్దిగా


తయారి విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో నూనె పోసి పచ్చి మిరపకాయలని ముక్కలుగా కోసి  నూనెలో వేసి వేపుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ తరువాత కొబ్బరి ముక్కలుగా సన్నగా తరుగుకోండి. రోలు ఉంటే రోట్లో వేసుకుని రుబ్బుకోండి. ఈ కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో రోలు ఉండడం లేదు. రోలుకు బదులుగా  అందరి ఇళ్ళల్లో మిక్సీలో ఉంటున్నాయి కాబట్టి మిక్సీలో వేసుకోండి. ఓకే మిక్సీ జార్ తీసుకుని అందులో నానపెట్టిన చింతపండు గుజ్జు, కొబ్బరి ముక్కలు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, వేపిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా వేసుకోండి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి బాండీలో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, సాయిమినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టి దాన్ని కొబ్బరి పచ్చడిలో పోయండి. అంతే కొబ్బరి పచ్చడి రెడి అయిపోయినట్లే.. !!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: