పచ్చడి అంటే ఇదే కాబోలు..!

Suma Kallamadi
ప్రతి రోజు కూర వండాలంటే కొంచెం కష్టమైన పనే అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కోసారి కూర వండలేని పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు. అలాంటప్పుడు ఏ పచ్చడితోనే ఈరోజు తినేస్తా పోలా అనుకునే వారు కూడా ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ పచ్చడిలో నాన్ వెజ్ ముక్క తగిలితే అసలు కూరతో సంబంధం లేకుండా ప్రతి రోజు పచ్చడి వేసుకునే తింటారు. మరి పచ్చడిలో నాన్ వెజ్ ముక్క ఏంటి అని ఆలోచిస్తున్నారా.ఈ పాటికి మీకు అర్ధం అయ్యే ఉండాలే..మేము చెప్పబోయేది  చికెన్ పచ్చడి గురించి అని. చాలా మందికి చికెన్ పచ్చడి ఎలా తయారుచేయాలో తెలియదు. అలాంటి వారికోసం ఇండియా హెరాల్డ్ వారు చికెన్ పచ్చడి ఎలా చేయాలో మీకు వివరించబోతున్నారు. మేము చెప్పే విధంగా మీరు చికెన్ పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది.
 
కావాల్సిన పదార్ధాలు :
1/2 కిలో  చికెన్
400 ml నూనె
5 tbsp అల్లం వెల్లులి పేస్ట్ సరిపడా
50 gm ఉప్పు
50 gm పచ్చళ్ల కారం
1 tsp మెంతి పొడి
3 tbsp నిమ్మరసం
1 tsp పసుపు
1 tsp గరం మసాలా పొడి
తయారీ విధానం:
ముందుగా చికెన్ ను శుభ్రంగా నీటితో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో చికెన్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి నీరు మొత్తం ఇగిరిపోయే దాకా మీడియం ఫ్లేమ్ వేపండి. ముక్కలో నీరు పోయాక ఒక గిన్నెలోకి తీసుకోండి. తరువాత అదే బాండీలో నూనె వేడి చేసి అందులో ఉడికించుకున్న చికెన్ వేసి ఎర్రగా అయ్యేదాక వేపుకున్న తరువాత ముక్కల్ని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు మిగిలిన నూనెలో అల్లం వెల్లులి పేస్ట్  వేసి పచ్చి వాసన పోయేదాక వేపుకోవాలి.తరువాత అందులో మెంతి పొడి, ఉప్పు, కారం, గరం మసాలా, వేపిన చికెన్ ముక్కలు వేసి వెంటనే స్టవ్ ఆపేయండి. కారం వేసాక ఎక్కువ సేపు పొయ్యి మీద ఉంచకండి. కారం మాడిపోతుంది.అన్నీ పదార్ధాలు చల్లారిన తరువాత  నూనె పైకి తేలుతుంది అప్పుడు నిమ్మ రసం కలిపి సీసాలో పెట్టండి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయినట్లే. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: