చికెన్ - క్యాప్సికమ్ కాంబో అదుర్స్...!
కావాల్సిన పదార్ధాలు:
1/2 కేజీ చికెన్
1/4 కేజీ క్యాప్సికమ్
150 గ్రాములు ఉల్లి పాయలు
6 రేకలు వెల్లుల్లి
నాలుగు పచ్చి మిర్చి
1/4 టీ స్పూన్ గరం మసాలా
చిన్న ముక్క అల్లం
1/2 టీ స్పూన్ పసుపు
తగినంత నూనె
సరిపడా ఉప్పు
అర కప్పు పెరుగు
1/2 టీ స్పూన్ ధనియాల పొడి
తగినంత కొత్తి మీర తరుగు
1/2 కప్ టమోటా ముక్కలు
తయారు చేయు విధానం:
ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తరువాత ముక్కలుగా కట్ చేసుకుని, వాటిని తగినంత ఉప్పు, కారం, పసుపు తగిన పదార్థాలతో మ్యారినేట్ చేసి కొద్ది సేపటి వరకు నాన బెట్టుకోవాలి.మరోవైపు క్యాప్సికమ్ ను పొడవు ముక్కలుగా తరగాలి. అలాగే ఉల్లి పాయల్ని పొడవుగా గానీ, రౌండ్’గా గానీ స్లైసుల్లాగా కోయాలి. అల్లం వెల్లుల్లను సన్నగా తరగి వుంచుకోవాలి.ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసి కాసేపు వేయించాలి. తర్వాత క్యాప్సికమ్స్, ఉల్లి పాయ ముక్కల్ని వేసి 5 నిముషాల పాటు వేయించాలి.కొద్ది సేపటి తర్వాత అందులో ముందుగా నానబెట్టి వుంచుకన్న చికెన్ ముక్కల్ని వేసి, కాస్త పెద్ద మంట మీద ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు మెత్తబడే వరకు ఎక్కువ మంట మీదే వేయించాలి.చికెన్ మెత్తబడగానే టమోటా ముక్కల్ని కలిపి మూత పెట్టి వేడి చేయాలి. కాసేపటి తర్వాత పచ్చి మిర్చి, గరం మసాలా, ధనియాల పొడుల్ని కలిపి ఉడికించాలి. దించే ముందు కొత్తి మీర తరుగుతో గార్నిష్ చేయాలి.