మామిడిపండుతో ఈ రెసిపీ ఎప్పుడన్నా ట్రై చేసారా..?

Suma Kallamadi
మామిడి పండు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. మామిడి కాయను ఉన్న అన్ని పండ్లలో కెల్లా రారాజు అని పిలుస్తారన్న విషయం అందరికి తెలిసిందే. రుచిలో మామిడికాయను మించిన పండు లేదు. తీపిదనంలో కానీ, పులుపుదనంలో కానీ మామిడి కాయను మించిన పండు మరొకటి లేదు. మామిడి పండు మనకి సీజనల్ దొరికే పండు. ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. అయితే అలాంటి మామిడి కాయతో ఎంతో రుచికరమైన ఒక స్పెషల్ రిసిపిని మీకు ఇండియా హెరాల్డ్ వారు పరిచయం చేయబోతున్నారు. అది ఏంటంటే మామిడి పండు మజ్జిగ చారు రెసిపీ.వినడానికి కొత్తగా ఉన్నా తింటే మాత్రం సూపర్ అంటారు.
కావాల్సిన పదార్ధాలు:
2 పండు మామిడిపండ్లు
1/2 cup పచ్చికొబ్బరి
1/2 tsp మిరియాలు
1 tsp జీలకర్ర
2 రెబ్బలు కరివేపాకు
ఉప్పు
300 ml నీళ్ళు
1/2 tsp కారం
 పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం
పసుపు – చిటికెడు
2 tsp శెనగ నూనె
మెంతులకొద్దిగా
1 tsp ఆవాలు
2 ఎండు మిర్చి
ఇంగువ – చిటికెడు
తయారీ విధానం :
ముందుగా మిక్సీ లో కొబ్బరి, మిరియాలు, జీలకర్ర వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. తరువాత మామిడి పండుని మెత్తగా నలిపి గుజ్జు తీసేయండి.టెంకె పారెయ్యండి. ఇప్పుడు పులుసు కాచే గిన్నెలో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్, మామిడి పండు గుజ్జు ఇంకా మిగిలిన పదార్ధాలన్నీ వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు రానివ్వండి. ఒక పొంగువచ్చాక అందులో చిలికిన పెరుగు వేసి మంట తగ్గించి మొత్తం కలిసేదాకా కలుపుతూనే ఉండాలి. పెరుగు కలిశాక ఒక్క పొంగురానివ్వాలి.ఇప్పుడు దాంట్లో సరిపడా ఉప్పు, కారం చూసుకోవాలి. తరువాత తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేపి మామిడి రసంలో కలపాలి. అంతే మామిడి పండు మజ్జిగ చారు రెడీ అయినట్లే. ఇది అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: