ఇలా ఉలవచారు ట్రై చేసారా.?

Suma Kallamadi
ఉలవచారు పేరు వింటే చాలు ఎవరికయినా నోరు ఊరిపోతోంది. చాలామంది ఈ ఉలవచారు అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఉలవచారుని ఏ ఫంక్షన్ జరిగిన బోజనాల్లో ఒక స్పెషల్ రెసిపిలాగా వడ్డిస్తున్నారు. అయితే ఈరోజు ఇండియా హెరాల్డ్ వారు ఇంట్లోనే ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో మీకు వివరించబోతున్నారు.
కావలిసిన పదార్ధాలు :
1 kg ఉలవలు
3 litres నీళ్ళు
౩ లేదా 4 tsp చింతపండు గుజ్జు
తగినంత ఉప్పు
1/2 tsp పసుపు
1 1/2 tsp కారం
1 మీడియం ఉల్లిపాయ
2 పచ్చిమిరపకాయలు
3 రెమ్మలు కరివేపాకు
1/2 tsp ఆవాలు
1/2 tsp జీలకర్ర
3 tbsp నూనె
తయారీ విధానం :
ముందుగా 1 kg ఉలవలని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తరువాత మూడు లీటర్ల నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి.అలా రాత్రంతా నానబెట్టిన ఉలవలను నీటితో సహా ఉంచి ప్రెషర్ కుకర్ లో ఒక గంట పాటు ఉడికించాలి.ఒక విజిల్ వచ్చేవరకు హై ఫ్లేమ్ మీద ఉడికించి,తరవాత సిమ్ లో పెట్టి ఉడికించాలి.నాలుగు అయిదు విజిల్స్ వచ్చాక
స్టవ్ ఆపేయాలి. కొంచెం సేపు అయ్యాక కుక్కర్ మూత తెరిచి ఉలవలని జల్లెడ లో వేసి నీళ్లను వడకట్టండి.మీకు సుమారుగా 800 ml ఉలవ నీరు వస్తుంది.ఇప్పుడు ఈ ఉలవల నీటితోనే ఉలవచారు ప్రిపేర్ చేయాలన్నమాట.
ఉలవచారు తయారీ విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె ఉంచి ౩ లేదా 4 స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి.తరువాత అందులో ఆవాలు,జీలకర్ర, కరివేపాకు,వేసి చిటపట లాడే వరకు వేయించాలి.తర్వాత ఉల్లిపాయ,పచ్చిమిర్చి వేసి నిముషం పాటు వేయించాలి.ఇప్పుడు వడకొట్టుకుని ఉంచుకున్న ఉలవలు నీటిని పొయ్యి మీద ఉన్న బాండీలో పోయాలి.10 నుండి 15 నిముషాల పాటు ఎక్కువ మంట పెట్టి మరిగించాలి. తర్వాత కొంచెం చింతపండు గుజ్జు,ఉప్పు,కారం,పసుపు వేసి సన్నని సెగ మీద 10 నిమిషాలు కాయాలి.ఎలా ఉలవచారు బాగా  చిక్కబడేదాకా కాచి స్టవ్ కట్టేయాలి.అంతే ఎంతో రుచికరమైన ఉలవచారు రెడీ.. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: