ఈ చపాతీలను ఎప్పుడన్నా టేస్ట్ చేసారా.?

Suma Kallamadi
ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. అందుకనే బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి,బరువు తగ్గించుకోవడానికి ఈ మధ్యకాలంలో చాలామంది  ఎక్కువగా రాత్రి వేళల్లో చపాతీలు తింటున్నారు.ప్రతి రోజు ఒకేలాగా చపాతీ తిని విసుగు చెందిన వారు ఇండియా హెరాల్డ్ వారు చెప్పే ఈ వెరైటీ చపాతీలు ఒకసారి ట్రై చేసి చూడండి.రుచికి రుచితో పాటు బరువు కూడా సులువుగా తగ్గవచ్చు. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు.సాధారణంగా మనం అందరం గోధుమ పిండితో చపాతీలను చేసుకుని తింటూ ఉంటాము కదా. అలాగే ఒకసారి మేము చెప్పే ఈ పిండితో కూడా చపాతీలు చేసి చూడండి.

 
రాగి పిండి: రాగి పిండి గురించి అందరికి తెలిసే ఉంటుంది. చాలామంది రాగి పిండితో రాగి జావా చేసుకుని మజ్జిగలో కానీ పాలలో గాని కలుపుకుని తాగుతారు.రాగి పిండిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ లాంటి పోషకాలు ఉన్నాయి. రాగిని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒకసారి రాగిపిండితో రోటీస్ చేసుకుని తినండి. రాగితో చేసిన రోటిస్ సులభంగా జీర్ణమవుతాయి.అలాగే బరువు కూడా ఈజీగా తగ్గుతారు.
బాదం పిండి: బాదం పప్పు గురించి మీరు వినే ఉంటారు. బాదం పోషకాహారానికి గొప్ప మూలం. బాదం పిండితో చేసిన రోటిస్ తినడం చాలా మంచిది. బాదంపప్పులో తక్కువ ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. అది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.


బజ్రా పిండి:  మీరు ఫైబర్ అధికంగా ఉండే చపాతీ కోసం చూస్తున్నట్లయితే, మీ ఆహారంలో బజ్రా రోటిస్ యాడ్ చేయండి. బజ్రా పిండి చపాతీలలో మెగ్నీషియం, ఇతర ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.బరువు కూడా సులభంగా తగ్గుతారు.
జోవర్ పిండి: సాధారణంగా మనం తినే గోధుమ చపాతీల కంటే జోవర్ పిండితో చేసిన చపాతీలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా ఈ పిండితో చేసిన చపాతీలు సులభంగా జీర్ణం అవుతాయి. జోవర్ జీర్ణక్రియను మరింత పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉండడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
వోట్ పిండి(Oat Flour): బరువు తగ్గాలని భావించే వారికి వోట్ పిండి ఒక అద్భుతమైన ఆహార పదార్ధం అని చెప్పవచ్చు.ఇందులో ఎక్కువగా బి-విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. పైన మేము చెప్పిన పిండి పదర్ధాలతో చపాతీలు చేసుకుని తినండి. బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: