ఆరోగ్యకరమైన ఆహారం అంటే.?

Suma Kallamadi
ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఎటువంటి అనారోగ్యాలు మన దరికి చేరవు. అందుకనే మన పూర్వీకులు అప్పట్లో నివసించే ప్రాంతం, కాలమునకు అనుగుణంగా తగిన ఆహార నియమాలు పాటిస్తూ వచ్చేవారు. అంతేకాకుండా కొంతమంది వాళ్ళ వంశపారంపర్యంగా కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ వచ్చేవారు. మంచి బలమైన ఆహారం తీసుకోవడం వల్ల జన్యుపరంగా మన శరీర దృఢంగా ఉంటుంది. పోషక లోపాలు తలెత్తకుండా ఉండాలన్నా, రోగనిరోధకశక్తి పెరగాలన్నా  జన్యుపరంగా అనుకూలమైన ఆహారం తీసుకోవాలి. శరీరానికి సరిపడని ఆహారం తింటే ఆ ప్రభావం కాలేయం మీద పడుతుంది. ఆహారంలో విషపదార్థాలు ఉంటే, వాటిని కూడా కాలేయం వడగడుతుంది. అయితే ఎన్నాళ్లని కాలేయం ఇలా పని చేస్తూ ఉంటుంది చెప్పండి.మనం ప్రతిరోజు శరీరానికి  సరిపడని ఆహారం తీసుకుంటే కాలేయం పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా జీవక్రియ రేటు కూడా తగ్గుతుంది. దీనితో రక్తపోటు, మధుమేహం, ఊబకాయం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.



అలాగే కొంతమంది లావుగా ఉన్న వాళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు, సన్నగా ఉన్నవాళ్లలో శక్తి లేదు. బలహీనతగా అనారోగ్యంగా ఉన్నాడు అని అనుకుంటే పొరపాటు పడినట్లే. మన శరీరం పని చేయడానికి సహకరిస్తే ఆరోగ్యంగా ఉన్నట్టు, లేదంటే అనారోగ్యంతో ఉన్నట్టు గ్రహించాలి. లావుగానో, సన్నగానో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు అనుకోవడం తప్పు. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఇంట్లో సాంప్రదాయకమైన వంటలు చేసి పెట్టేవాళ్ళు. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఆ అలవాట్లు అన్ని మారిపోయాయి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాక అందరు జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయారు. అలాగే ఇంట్లో చేసే సంప్రదాయ ఆహారాన్ని పిల్లలు ఇష్టపడకపోవడానికి కారణాలు కూడా లేకపోలేదు లెండి

బయట దొరికే జంక్‌ ఫుడ్‌లో రుచిని పెంచే టేస్టింగ్‌ సాల్ట్‌ వంటివి వాడడం వల్ల పిల్లలు వాటిని ఇష్టంగా తింటూ ఉంటారు. 




కానీ ఆ ఆహారం పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.కాబట్టి హానికారకమైన జంక్‌ ఫుడ్‌ను మాన్పించి, పిల్లల చేత ఇంటి ఆహారం తినిపించేలా చేయడం తల్లితండ్రుల బాధ్యత. ఇంట్లోనే పిల్లలకు నచ్చిన వంటకాలను చేసి పెట్టండి. ఈ కాలంలో బయట ఫుడ్ తినడం అంత మంచిది కాదు. రుచికి బాగుంటుంది కానీ ఆ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అలాగే పిల్లలను సంప్రదాయ ఆహారం తినమని బలవంతం చేయకుండా సాంప్రదాయ ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచి.జరుగుతుందో చెప్పండి. అలాగే తినే ఆహారంలోని పోషక విలువలు, వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వాళ్ళకి వివరించి, ఆహారం మీద ఇష్టం పెరిగేలా చేయండి. !


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: