స్పైసీ వెజ్ ఖీమా మసాలా కర్రీ తయారీ విధానం... !

Suma Kallamadi
ప్రతిరోజు ఒకేలాగా కాకుండా ఈసారి కాస్త వెరైటీగా వెజ్ ఖీమా మసాలా కర్రీ వండి పెట్టండి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాక ఈ రెసిపీని ఒకసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది ఈ రెసిపి. ఈ కూర కోసం ముందుగా కూరగాయలని సన్నగా ఖీమాలా తరిగి చేస్తారు అందుకే దీనికి ఆ పేరు. రొటీలు పూరీ చపాతీతో నంచుకుని తింటే అందరికి నచ్చుతుంది, ఇష్టంగా తింటారు. ఆ కూర నేను తినను, ఈ కూర తినను అనే పిల్లలకి ఇలా చేసి పెడితే వంకలు వెతక కుండా ఇష్టంగా తింటారు. అలాగే ఈ కూర మనకి నచ్చేలా ఘాటుగా కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా  కావాల్సిన పదార్ధాలు ఏంటో చూద్దామా. !
 
కావలిసిన పదార్ధాలు :
1/2 cup కాప్సికం తరుగు
1/4 cup ఫ్రోజెన్ బాటనీ
1/2 cup కేరట్ తరుగు
1/2 cup ఫ్రెంచ్ బీన్స్ తరుగు
1/2 cup ఉల్లిపాయ సన్నని తరుగు
3 టమాటో పేస్టు
2 పచ్చిమిర్చి తరుగు
2 tbsps కొత్తిమీర
2 tsps కారం
1 tsp ధనియాల పొడి
1 tsp వేయించిన జీలకర్ర పొడి
1 tsp గరం మసాలా
1/2 tsp  కారం
ఉప్పు సరిపడా
1 tsp జీలకర్ర
1 tbsp అల్లం వెల్లులి పేస్టు
2 tsps జీడిపప్పు పేస్టు
1 tsp ఫ్రెష్ క్రీం
2 tbsps నూనె
1 tbsp బటర్
2 tsps నెయ్యి
250 ml నీళ్ళు
తయారీ విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో కొంచెం నూనె, బటర్ వేడి చేయాలి.  అందులో జీలకర్ర, వెల్లులి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా వేయించుకోండి.ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసి  గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకోండి.తరువాత ఉప్పు కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి బాగా వేయించి, కాప్సికం ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి.ఈ మిశ్రమంలో ముందుగా రెడీగా ఉంచుకున్న టమాటో పేస్టు వేసి టొమాటోలు పచ్చి వాసన పోయే దాకా ఫ్రై చేసుకోండి. ఆ తరువాత కేరట్ తరుగు, ఫ్రెంచ్ బీన్స్ సన్నని తరుగు వేసి ముక్కలు మగ్గే దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రోజెన్ బాటనీ వేసి మరో 3 నిమిషాలు ఫ్రై చేసుకుని నీళ్ళు పోసి, జీడిపప్పు పేస్టు వేసి బాగా కలుపుకుని కూరని మీడియం మంట మీద దగ్గర పడనివ్వండి.పైకి నూనె కనిపించేవరకు సన్నని మంట మీద మగ్గనివ్వాలి. తరువాత కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో ఘాటు అయిన ఖీమా మసాలా కర్రీ తయారయినట్లే.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: