రెస్టారెంట్‌ స్టెయిల్‌ లో ఆలూ గోబి తయారీ విధానం..!

Suma Kallamadi
నేటి సమాజంలో చాలా మంది బయటి ఫుడ్ కి ఎక్కువగా అలవాటు పడ్డారు. ఇక బయటి ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కరోనా సమయంలో రెస్టారెంట్ ఫుడ్ ని ఫుడ్ ని మిస్ అవుతున్నారా. అయితే ఇంట్లోనే రెస్టారెంట్ స్టెయిల్‌ లో రుచికరమైన ఆలూ గోబిని తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం.
ఆలూ గోబి కావలసిన పదార్థాలు:
గోబి- 1, ఆలుగడ్డ- రెండు, ఉల్లిగడ్డ- 1, టమోటాలు- రెండు, జీడిపప్పు- 15, అల్లం వెల్లుల్లి పేస్టు- స్పూను, కారం పొడి- స్పూను, పసుపు- అర స్పూను, గరం మసాలా పొడి- స్పూను, నూనె, ఉప్పు, నీళ్లు- తగినంత, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క- చెరో రెండు.
ఆలూ గోబి తయారుచేసే విధానం:
అయితే ముందుగా జీడిపప్పును అర గంటసేపు నానబెట్టి ముద్ద చేసుకోవాలి. టమోటా, ఉల్లిగడ్డల్ని ముక్కలుగా కట్‌ చేయాలి. గోబీ పూలను కత్తిరించి నీళ్లలో ఉప్పు వేసి ఇరవై నిమిషాలు ఉడికించి నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి మసాలా దినుసులన్నీ వేసి వేగాక ఉల్లి ముక్కల్ని దోరగా వేయించాలి. దీనికి అల్లం వెల్లుల్ని పేస్టుని కలపాలి.
ఆ తరవాత టమోటా ముక్కల్ని కూడా జతచేసి ఓ అయిదు నిమిషాలు మగ్గించాలి. దీనికి జీడిపప్పు పేస్టు, పసుపు, కారప్పొడి వేసి కలుపుతూ ఉండాలి. కాస్త వేగాక గోబీ, ఆలు ముక్కలు, ఉప్పు, తగినంత నీరు పోసి మూతపెట్టి ఓ అయిదు నిమిషాలు ఉడికించాలి. ఆఖరున గరం మసాలా పొడి వేసి కూరంతా కలియబెట్టాలి. రెండు నిమిషాల్లో ఆలూ గోబి రెడీ. కూర మరీ గట్టిగా అయినట్టు అనిపిస్తే కాస్త నీళ్లు పోసి కలిపితే సరి. ఇలా ఇంట్లోనే రుచికరమైన వంటలు చేసుకొని తినడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: