ఆహా! ఏమి రుచి అనిపించే గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూడండి.. !

Suma Kallamadi
 ఆహా ఏమి రుచి తినరా మైమరిచి... తాజా రుచులలో రాజా ఎవరంటే వంకాయే అండి.. అని మన తెలుగు వారు వంకాయ గురించి ఎన్నో పాటలు కూడా రాసారు. అంతా రుచికరంగా ఉంటుంది వంకాయ కూర. మన తెలుగువారి వంటలలో గోగూర పచ్చడి, ఆవకాయ లాగానే గుత్తి వంకాయకు చాలా ప్రాముఖ్యత ఉంది.కూరగాయలన్నింటిలోనూ రారాజు వంకాయ.వంకాయతో ఏ వెరైటీ చేసిన అదరహో అనాలిసిందే. లేత వంకాయల్ని కడిగి అందులో బాగా మాసాల దట్టించి వండితే చాలా రుచికరంగా ఉంటుంది.మరి ఆలస్యం చేయకుండా గుత్తివంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం.. !!
కావలిసిన పదార్ధాలు:
లేతకాయలు - అర కేజీఉల్లిపాయలు
అర కేజీటమోటాలు - అర కేజీ
ధనియాల పొడి - హఫ్ టీ స్పూన్
కారం  - 1 టీ స్పూన్
ఉప్పు - 2 టీ స్పూన్
పసుపు - తగినంత
ఆవాలు - హఫ్ టీ స్పూన్
కొబ్బరి: చిన్న ముక్క
అల్లం -  కొద్దిగా
వెల్లులి పాయలు -5 రెబ్బలు
నూనె - 2 టీ స్పూన్
పచ్చి  మిర్చి - 9
కొత్తిమీర- తగినంత
నువ్వులు -25 గ్రాములు
తయారు చేయువిధానం :
వంకాయలను శుభ్రంగా కడిగి  పెట్టుకొవాలి.టమోటాలు,ఉల్లిపాయలు,చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .వంకాయల్ని నిలువుగా గాట్లు పెట్టాలి. ఒక పాన్ లో నువ్వులు వేయించుకోవాలి.దోరగా వేగాక వాటిని మిక్సీలొ వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.మిరప పొడి,ధనియాలు పొడి, పసుపు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్ని గ్రైడ్ చేసి వుంచుకోవాలి.ఈ మసాలా ముద్దలో ఉప్పు, కొంచెం కారం వేసి కట్ చేసి వుంచిన వంకాయల్లో పెట్టాలి. తరువాత ఒక మందపాటి గిన్నే తీసుకుని స్టౌ మీద పెట్టి నూనె పొయ్యాలి.నూనె కాగాక పోపు వేసి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని మంట మీద ఉడకనివ్వాలి. ఆ ముక్కలు బాగా ఉడకాలి.ఇప్పుడు ఆ గిన్నెలొ సరిపడా నీరు పోసి వంకాయలు బాగా మగ్గనివ్వాలి, చివరిలో పక్కన పెట్టిన నువ్వుల పొడిని గిన్నెలో వేసి అడుగు అంటకుండా నిముషం ఉంచాలి.ఉప్పు, కారం లైట్ గా పైన చల్లాలి. చివరలో కొంచెం కొత్తిమీర చల్లి అలంకరిస్తే నోరు ఊరించే గుత్తి వంకాయ కూర రెడీ.!!సాంబార్ లో గాని రసంలో గాని నంచుకుని తింటే చాలా బాగుంటుంది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: