హెల్తీ గోధుమ దోసె ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
పొద్దున్నే మనం బ్రేక్ ఫాస్ట్ కోసం రకరకాల ఐటమ్స్ చేసుకోని తింటాము. ఒకరోజు ఇడ్లి తింటాము. ఒకరోజు దోసె తింటాము. ఇంకోరోజు ఉప్మా, ఊతప్పం, గారెలు, పులిహోర, టమాటా రైస్ ఇలా ఎన్నో రకాల ఐటమ్స్ చేసుకోని తింటుంటాము. అయితే వీటన్నిటి కంటే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఒకటి వుంది. అదే గోధుమ దోసె. గోధుమ పిండితో చపాతి మాత్రమే కాదు రుచికరమైన గోధుమ దోసె కూడా చేసుకోవచ్చు. గోధుమ దోసె కేవలం రుచికే కాదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక ఈ రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన గోధుమ దోసెని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి. మీరు ఇంకా ఇంట్లో ట్రై చేసి చూడండి..

రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన గోధుమ దోసె కావాల్సిన పదార్ధాలు...
గోధుమ పిండి: 2కప్స్
కొబ్బరి : 2 టేబుల్ స్పూన్స్
నీళ్ళు: 1కప్
ఉప్పు: రుచికి సరిపడా
ఇక ఈ రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన గోధుమ దోసె తయారు చేయు విధానం చూడండి ....
ముందుగా గోధుమలను నీళ్ళలో వేసి బాగా కడగాలి. తర్వాత గోధుమల నుండి నీరు బాగా వంపేసి ఒక అరగంట గోధుమలు పక్కన పెడితే, నీరు మొత్తం కారిపోయి డ్రై అవుతాయి.తర్వాత అరగంట తర్వాత ఈ గోధుమలను మిక్సీ జార్ లో వేసి రఫ్ గా పొడి చేసుకోవాలి.. మీ దోసె పౌడర్ రెడీ.ఇప్పుడు దోసె పిండిని తయారుచేసుకోవాలి. పిండిని మిక్సీలో వేసి, పిండితో పాటు, కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్ళు పోసి దోసె పిండిలా గ్రైడ్ చేసుకోవాలి.తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వంపుకోని అందులో రుచికి సరిపడా ఉప్పువేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, నూనె రాసి వేడి అయ్యాకో గోధుపిండిని దోసెలా వేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి. అంతే దోసె రెడీ అవ్వగానే గ్రీన్ చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయండి చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా కరివేపాకు చట్నీకి కూడా బాగుంటుంది. ఈ గోధుమ దోసె ఎంతో రుచికరంగాను అలాగే ఇంకా ఎంతో ఆరోగ్యాకరంగాను ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన గోధుమ దోసె ని మీరు ఇంట్లో తయారు చేసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: