పెరుగు, బెండకాయ మసాలా కర్రీ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...
కావల్సిన పదార్థాలు :
1.బెండకాయ - ½ కిలో (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
2.ఉల్లిపాయలు - 2 (పెద్దవి సన్నగా తరిగి పెట్టుకోవాలి)
3.నూనె - 1½ tbsp
4. టమోటోలు - 2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
5. అల్లం - ½ tsp (సన్నగా తరగాలి)
6. వెల్లుల్లి పేస్ట్ - ½ tsp
7. ఉద్దిపప్పు - 1 tsp
8. కారం - 1 tsp
9. ఆవాలు - ½ tsp
10.పసుపు - ½ tsp
11. కొబ్బరి తురుము - 1½ tsp
12.గరం మసాలా - 1 tsp
13.కరివేపాకు - 4-5
14.డ్రై మ్యాంగో పౌడర్ - ½ tsp
15.జీడిపప్పు - 10 (పాలలో నానబెట్టుకోవాలి) 16.కుంకుమపువ్వు - ½ tbsp (పొడి చేసుకోవాలి)
17.ధనియాల పొడి - 1½ tsp
18. పెరుగు - 1 cup
19.ఉప్పు రుచికి సరిపడా
20.వాటర్ - 2 cups
21.ఇంగువ - చిటికెడు
22.జీలకర్ర - సగం ముక్క
తయారుచేయు విధానం:
ముందుగా పాలలో నానబెట్టిన జీడపప్పు, కొబ్బరి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.బెండకాయలను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత బెండకాయ ముక్కలు వేసి పొడిగా ప్రై చేసుకోవాలి. వీటిని ఒక పేపర్ టవల్ మీద వేయాలి. ఇలా వేయడం వల్ల ఎక్సెస్ ఆయల్ పీల్చుకుంటుంది.అదే పాన్ లో మరికొద్ది నూనె వేసి వేడి అయ్యాక, ఆవాలు, జీలకర్ర, red CHILLIES' target='_blank' title='ఎండుమిర్చి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఎండుమిర్చి, ఉద్దిపప్పు, కరివేపాకు, వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.తర్వాత అందులోనే ఉల్లిపాయలు, అల్ల వేసి సాప్ట్ అయ్యే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో రెడ్ చిల్లీ పౌడర్ , పసుపు, ధనియాల పొడి, , కస్తూరి మేతి, మామిడికాయ పొడి , వెల్లుల్లి పేస్ట్ మరియు గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ వేపుకోవాలి. టమోటో మెత్తబడ్డాక అందులో జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ , పెరుగు వేసి మిక్స్ చేయాలి. తర్వాత బెండకాయ ముక్కలను కూడా వేసి మిక్స్ చేసి వేగించుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి కొద్ది నిముషాలు ఉడికించుకోవాలి. కర్రీ చిక్కగా మారితే అందులో కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు సరిచూసుకోవాలి. అంతే దహీ హైదరాబాదీ బేండి మసాల కర్రీ రిసిపి రెడీ అయినట్లే...వేడి వేడిగా తింటే బాగుంటుంది...ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన బెండకాయ పెరుగు మసాలా కర్రీ మీరు ఇంట్లో ట్రై చెయ్యండి...